Independence Day 2024: లైవ్ అప్‌డేట్స్.. దేశ వ్యాప్తంగా అంబరాన్నంటిన మువ్వన్నెల సంబురాలు

Update: 2024-08-14 14:33 GMT
Live Updates - Page 2
2024-08-15 04:24 GMT

సంస్కరణలతో 13,5 శాతం వృద్ది రేటు సాధించాం: చంద్రబాబు



దేశంలోని తెలుగువారంతా ఒకే రాష్ట్రంగా కలిసుండాలని కలలు కన్నామని చంద్రబాబు చెప్పారు. 1946లోనే విశాలాంధ‌్ర కోసం పోరాడినట్టు చెప్పారు. పొట్టిశ్రీరాములు ప్రాణత్యాగంతో ఆంధ్రరాష్ట్రం ఏర్పడిందన్నారు. కర్నూల్ రాజధానిగా 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. 1956 నవంబర్ 1న ఏర్పడిన తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర విభజనతో తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయన్నారు. విభజనతో ఏర్పడిన నవ్యాంధ్రకు రాజధాని లేని పరిస్థితుల్లో పాలన సాగించినట్టు చంద్రబాబు చెప్పారు. తన అనుభవం, ప్రజల సహకారంతో కష్టపడేతత్వంతో కొద్దికాలంలోనే నిలదొక్కుకున్నామన్నారు. సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలకు రూపకల్పన చేసి వేగంగా ముందుకువెళ్తున్నట్టు చెప్పారు. దేశంలో ఎవరూ ఊహించని విధంగా సంస్కరణలతో 13,5 శాతం వృద్ది రేటుతో ముందుకు సాగుతున్నామని సీఎం చెప్పారు.

2024-08-15 04:15 GMT

శాంతిభద్రతల విషయంలో రాజీ లేదు: కాకినాడలో పవన్

కాకినాడలో పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతాకాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కోట్ల మంది బలిదానాలను ఈ రోజు మనం గుర్తుకు తెచ్చుకోవాలన్నారు.ఎందరో త్యాగధనులతోనే మనకు స్వాతంత్ర్యం వచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఇవాళ్టి నుంచి అన్న క్యాంటీన్లను పున:ప్రారంభిస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. రాజీలేని ధోరణితో శాంతిభద్రతలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో స్పష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సూపర్ సిక్స్ అమలు, రాష్ట్ర పున: నిర్మాణం కోసం ముందుకెళ్తున్నామని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత సామాజిక పెన్షన్లు పెంచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

2024-08-15 04:12 GMT

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో అమరుల స్థూపం వద్ద నివాళులర్పించిన రేవంత్ రెడ్డి

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో అమరుల స్థూపం వద్ద నివాళులర్పించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంతకుముందు తన నివాసంలో జాతీయ పతాకాన్ని సీఎం ఆవిష్కరించారు.

2024-08-15 04:11 GMT

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్

కాకినాడలో పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతాకాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కోట్ల మంది బలిదానాలను ఈ రోజు మనం గుర్తుకు తెచ్చుకోవాలన్నారు.ఎందరో త్యాగధనులతోనే మనకు స్వాతంత్ర్యం వచ్చిందని ఆయన గుర్తు చేశారు. 

2024-08-15 03:55 GMT

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

2024-08-15 03:52 GMT

బంగ్లాదేశ్ లో శాంతి స్థాపనకు కృషి చేస్తా: మోదీ

బంగ్లాదేశ్ లో అల్పసంఖ్యాక వర్గాలు ఇబ్బందులు పడ్డారని ప్రధాని మోదీ చెప్పారు. బంగ్లాదేశ్ లో హింసాత్మక ఘటనలు బాధాకరమన్నారు. బంగ్లాదేశ్ లో శాంతి నెలకొల్పేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అక్కడ మైనార్టీలు ఇబ్బందులు పడ్డారని మోడీ గుర్తు చేశారు.

కామన్ సివిల్ కోడ్ దేశానికి చాలా అవసరమన్నారు. సెక్యులర్ సివిల్ కోడ్ పై ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ దేశానికి అవసరమని ఆయన చెప్పారు. మళ్లీ మళ్లీ ఎన్నికలు దేశానికి దేశానికి మంచిది కాదన్నారు.

2024-08-15 03:40 GMT

అంతరిక్షంలో భారత స్పేస్ సెంటర్ కల సాకారం కావాలి: మోదీ



అంతరిక్షంలో భారత స్పేస్ సెంటర్ కల సాకారం కావాలని మోదీ ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నట్టుగా ఆయన చెప్పారు. ప్రపంచంలోనే భారత్ నెంబర్ వన్ ఆర్ధిక వ్యవస్థగా ఎదుగుతోందని మోదీ చెప్పారు.భారత ప్రస్తానం ప్రపంచానికే స్పూర్తిదాయకమని ఆయన తెలిపారు. ప్రపంచంలో భారత్ ఇప్పుడు శక్తివంతంగా మారిందన్నారు. దేశంలో బ్యాంకింగ్ రంగాన్ని పటిష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

2024-08-15 03:35 GMT

భవిష్యత్తులో భారత్ లో డిఫెన్స్ హబ్: మోదీ

రక్షణ రంగంలో స్వయం సమృద్దిని సాధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విదేశాల నుంచి ఒక్క పరికరం కూడా కొనుగోలు చేయలేదన్నారు. భారత్ భవిష్యత్తులో డిఫెన్స్ హబ్ ను కూడా నెలకొల్పుతుందని ఆయన చెప్పారు.

2024-08-15 03:33 GMT

మౌలిక సదుపాయాల కల్పనలో బలమైన శక్తిగా భారత్: మోదీ

మౌళిక సదుపాయాల రంగంలో భారత్ బలమైన శక్తిగా ఎదిగిందని మోదీ చెప్పారు. త్వరలోనే భారత్ ఇండస్ట్రీయల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మొబైల్ రంగంలో భారత్ గణనీయమైన అభివృద్దిని సాధించిందని ప్రధాని చెప్పారు. మొబైల్ ఫోన్లను ఎగుమతి చేసే స్థాయికి భారత్ చేరిందన్నారు. దేశంలో 5 జీ వ్యవస్థను విస్తృతపరిచిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

2024-08-15 03:30 GMT

మెడిసిన్ చదవేందుకు భారత యువత ఇతర దేశాలకు వెళ్తున్నందున దేశంలో మెడికల్ సీట్లను పెంచుతున్నామన్నారు.

గత పదేళ్లలో మెడికల్ సీట్లను లక్ష వరకు పెంచినట్టుగా మోదీ చెప్పారు. రానున్న పదేళ్లలో 75 వేల మెడికల్ సీట్లను పెంచాలని లక్ష్యంగా నిర్ణయించిన విషయాన్ని ఆయన చెప్పారు.

Tags:    

Similar News