TOP 6 News @ 6PM: అల్లు అర్జున్ ఇంటిపై కోడి గుడ్లు, టమాటలు, రాళ్లతో దాడి.. అల్లు కుటుంబానికి మాస్ వార్నింగ్
1) OU JAC Attack on Allu Arjun's residence: అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసి దాడి
OU JAC Protests Against Allu Arjun: అల్లు అర్జున్ ఇంటి ఎదుట ఓయూ జేఏసీ విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. ఆయన ఇంటిపై కోడి గుడ్లు, టమాటలు, రాళ్లు రువ్వారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళా అభిమాని మృతికి అల్లు అర్జున్ కారణం అంటూ విద్యార్థి సంఘాల నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. రేవతి మరణానికి అల్లు అర్జున్ బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసి దాడి గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు భారీ సంఖ్యలో బలగాలను మొహరించారు. ఈ వివాదంపై ఇప్పటికే కేసు విచారణ కోర్టులో ఉన్నందున మీరు ఆందోళన విరమించాలని పోలీసులు ఓయూ జేఏసి నేతలను వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తున్నారు.
2) ACP Vishnu Murthy counter to Allu Arjun: తోలు మంచిగా పెట్టుకోండి... లేదంటే తోలు పగులుద్ది.. ఏసీపీ వార్నింగ్
ACP Vishnu Murthy counter to Allu Arjun: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై, పోలీసులపై శనివారం అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ద్వారా చేసిన వ్యాఖ్యలకు ఇవాళ ఏసీపీ విష్ణు మూర్తి స్పందించారు. గత 15 రోజులుగా పోలీసుల మీద కొంతమంది కావాలనే బండలు వేస్తున్నారని ఏసీపీ విష్ణుమూర్తి. ప్రజలను రక్షించడంలో నిమగ్నమై ఉన్న పోలీసుల మీద అవాకులు చెవాకులు పేలుతున్నారన్నారు. డబ్బుతో మదమెక్కిన బడాబాబులు పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని తెలిపారు. సొంత కుటుంబాల కోసం సమయం వెచ్చించకుండా ప్రజల కోసం సేవ చేస్తోన్న పోలీసులను తిడుతున్నారు. ఒక్క 10 నిమిషాలు మేం ఉద్యోగాలు చేయమని వదిలిపెట్టిపోతే మీ బతుకులు ఎక్కడుంటాయో ఆలోచించుకోండి అని ఏసీపీ హెచ్చరించారు.
3) Allu Arjun's request to FANS: అభిమానులకు అల్లు అర్జున్ ట్వీట్
Allu Arjun's request to FANS: అల్లు అర్జున్ తన అభిమానుల కోసం ఎక్స్ ద్వారా ఒక మెసేజ్ పంపించారు. తన అభిమానులు తమ అభిప్రాయాలను బాధ్యాతాయుతంగా చెప్పాలని అన్నారు. ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దని సూచించారు. ఫ్యాన్స్ ముసుగులో గత కొన్ని రోజులుగా కొంతమంది ఫేక్ ప్రొఫైల్స్‌తో, ఫేక్ ఐడీలతో పోస్టులు పెడుతున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందన్నారు. వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అల్లు అర్జున్ ఎక్స్ ద్వారా చెప్పారు.
నెగటివ్ పోస్టులు పెడుతున్న వారికి తన అభిమానులు దూరంగా ఉండాలని అల్లు అర్జున్ కోరారు. ఆన్‌లైన్‌లోనే కాదు... ఆఫ్‌లైన్‌లోనూ ఎవ్వరిపైనా దుర్భాషలకు దిగరాదని అల్లు అర్జున్ తన అభిమానులకు విజ్ఞప్తి చేస్తూ ఈ ట్వీట్ చేశారు.
4) సంధ్య థియేటర్లో జరిగింది ఇదే.. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
Hyderabad CP CV Anand's reply to Allu Arjun allegations: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అసలు పోలీసులు తనకేమీ చెప్పలేదని అల్లు అర్జున్ ఆరోపించిన విషయం తెలిసిందే. థియేటర్ యాజమాన్యం చెబితేనే తాను థియేటర్ నుండి వెళ్లిపోయానని అల్లు అర్జున్ చెప్పిన మాటలకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ బదులిచ్చారు. డిసెంబర్ 2 నాడు సంధ్య థియేటర్లో ఏం జరిగిందో మీరే చూడండి అంటూ వీడియో ప్రదర్శించారు. అల్లు అర్జున్ థియేటర్లోకి రావడం, తిరిగి వెళ్లడం, వెళ్లేటప్పుడు డీసీపీ కూడా ఉన్న దృశ్యాలను చూపించారు. బౌన్సర్లకు వెంటపెట్టుకుని అల్లు అర్జున్ తొక్కిసలాటకు కారణమైనట్లు తెలిపారు. బౌన్సర్లు వేసే వేషాలకు సెలబ్రిటీలే బాధ్యులు అవుతారని సీవీ ఆనంద్ హెచ్చరించారు.
5) Auto Drones for AP CM Chandrbabu Naidu's security: ఏపీ సీఎం చంద్రబాబు ఇంటి చుట్టూ ఆటో డ్రోన్ చక్కర్లు
తన చుట్టూ ఉన్న భారీ బందోబస్తు, భద్రతా బలగాల సిబ్బందిని తగ్గించుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఓ కొత్త విధానాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన అటానమస్ ఆటో డ్రోన్స్ సాయంతో సీఎం చంద్రబాబు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఈ డ్రోన్ ప్రతీ 2 గంటలకు ఒకసారి సీఎం చంద్రబాబు ఇంటి చుట్టూ గాల్లో చక్కర్లు కొడుతుంది. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, వాహనాల రాకపోకలను గుర్తించి సంబంధిత విభాగానికి సమాచారాన్ని చేరవేరుస్తుంది. ఆ సమాచారం సాయంతో భద్రతా సిబ్బంది స్పందించి తగిన చర్యలు తీసుకునేలా ఈ ఏర్పాట్లు చేపట్టినట్లు సమాచారం.
6) Navya Haridas's petition against Priyanka Gandhi: ప్రియాంకా గాంధీ ఎన్నికను సవాల్ చేస్తూ బీజేపి అభ్యర్థి పిటిషన్.. స్పందించిన కాంగ్రెస్
కేరళలోని వయనాడ్‌లో ఇటీవల జరిగిన లోక్ సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా గాంధీ 5 లక్షల పైగా మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, ప్రియాంకా గాంధీ అఫిడవిట్ లో అన్ని వివరాలు పూర్తిగా పొందుపర్చనందున ఆమె ఎన్నిక చెల్లదంటూ ప్రియాంక చేతిలో ఓటమిపాలైన బీజేపి అభ్యర్థి నవ్య హరిదాస్ కేరళ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
నవ్య హరిదాస్ పిటిషన్ పై తాజాగా కాంగ్రెస్ నేతలు స్పందించారు. నవ్య పిటిషన్ ను కేవలం చీప్ పబ్లిసిటీ స్టంట్ గా రాజ్యసభ ఎంపీ ప్రమోద్ తివారీ అభివర్ణించారు. నవ్య పిటిషన్ ను కొట్టేయడమే కాదు... ఇలాంటి పిటిషన్ తో కోర్టు సమయం వృధా చేశారని కోర్టు జరిమానా కూడా విధిస్తుందని అన్నారు. మరో నేత మాణికం ఠాగూర్ మాట్లాడుతూ... బీజేపికి పిటిషన్ వేసే హక్కు ఉంది కానీ సత్యం మాత్రం తమ వైపే ఉందన్నారు.