Bengaluru Truck Accident News: ఆరుగురు ప్రయాణిస్తోన్న కారుపై పడిన కంటైనర్ లారీ

Update: 2024-12-21 10:07 GMT

Container truck overturns on car in Bengaluru outskirts: బెంగళూరు శివార్లలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భారీ బరువున్న కార్గొ కంటైనర్‌తో వెళ్తున్న ట్రక్కు అదుపు తప్పి కారుపై పడింది. ఈ రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తోన్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా బెంగళూరు పోలీసులు గుర్తించారు. నగర శివార్లలోని నేలమంగళలో 48వ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

కంటైనర్ కారుపై పడటంతో ఆ బరువుకు కారు మొత్తం కిందకు అణిగిపోయింది. దీంతో కారులో ఉన్న వాళ్లంతా అందులోనే ప్రాణాలు కోల్పోయారు. అది బెంగళూరు -తూమ్‌కూర్ మధ్య భారీ సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగించే రహదారి. ఈ రోడ్డు ప్రమాదం కారణంగా భారీ సంఖ్యలో వాహనాలు గంటలతరబడి నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రంగంలోకి దిగిన పోలీసులు సహాయ చర్యలు చేపట్టి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటన జరిగిన తీరుతెన్నులపై దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News