Rajasthan: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..పేలిన సీఎన్జీ ట్రక్కు..20కి పైగా వాహనాలకు మంటలు
Rajasthan: రాజస్థాన్‌లోని అజ్మీర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సీఎన్జీ గ్యాస్ తో వెళ్తున్న ట్రక్కు..మరో ట్రక్కును ఢీకొట్టింది. దీంతో సీఎన్జీ ట్రక్కు పేలింది. ఈ పేలుడు ధాటికి రోడ్డుపై ఉన్న 20 వాహనాలకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఓ బస్సు కూడా ప్రమాదానికి గురైంది. ప్రయాణికులు ఎలాగోలా బస్సు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. తీవ్రగాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది, సివిల్ డిఫెన్స్ పోలీసులు, స్థానికుల సాయంతో వాహనాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటలకు భాంక్రోటక డి క్లాథాన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.