Viral video: పాపం మొసలి.. ఎగిరే డ్రోన్‌ను మింగింది..నోట్లో బ్యాటరీ పేలింది.. చివరికి ఏమైందంటే?

Update: 2024-12-19 04:43 GMT

Viral video: మొసలి అనగానే చాలా మంది భయపడుతుంటారు. మొసలికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ అవుతుంటాయి. పెద్ద పెద్ద జంతువులను సైతం వేటాడి వెంటాడి మింగిస్తుంటాయి. జంతువులను ఎంతో చాకచక్యంగా దాడి చేసి వాటిని నీటిలోకి లాక్కెళ్తుంటాయి. ఇలాంటి వీడియోలో ఎన్నో వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా ఓ విచిత్ర ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది.

నీటిపై డ్రోన్ ఎగురుతుండగా..నీటిలో నుంచి పైకి వచ్చిన మొసలి అది పక్షి అనుకుందేమో..సడెన్ గా దానిపై దాడి చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే డ్రోన్ మింగిన వెంటనే అందులోని బ్యాటరీ పేలిపోయింది. దీంతో మొసలినోట్లోనే బ్యాటరీ పేలడంతో మొత్తం పొగ వ్యాపించింది. అయినా పట్టించుకోకుండా మొసలి దాన్ని మింగేసింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇలా చేయడం ఏమాత్రం సరికాదు అని కొందరు అంటుంటే..ఈ మొసలిని చూస్తే భయం అవుతుందంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది ఇమోజీలతో తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను @ఇందర్‌జీత్‌బరాక్ అనే పేరుతో ఎక్స్ లో షేర్ చేశారు.


Tags:    

Similar News