Cold Weather: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి..కనిష్టానికి పడిపోతున్న ఉష్ణోగ్రతలు

Update: 2024-12-19 00:55 GMT

Cold Weather: తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలలతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 8గంటల వరకు జనాలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే గజగజ వణుకుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో చలి తీవ్రత పెరిగింది ఈ నేపథ్యలో జిల్లాల్లో పాఠశాలల సమయాలను మార్చాలంటూ పేరెంట్స్, స్టూడెంట్స్, ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశారు. దీంతో ప్రభుత్వం పాఠశాలల సమయాల్లో మార్పులు చేసింది.

ఆదిలాబాద్ జిల్లాల్లో రికార్డు స్థాయిలో చలితీవ్రత పెరిగింది. ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల కంటే ఆదిలాబాద్ జిల్లాలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉదయం పూట చాలా వరకు దట్టమైన పొగమంచు కురుస్తుంది. దీంతో సమీపంలో ఏం ఉందో కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో ఉదయం పూట కూడా వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో జిల్లాల్లో పాఠశాల సమయాలను మార్చాలని తల్లిదండ్రులు,విద్యార్థుల, ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి విజ్నప్తి చేశారు. చలి తీవ్రత కారణంగా పాఠశాలలో హాజరు శాతం కూడా తగ్గిపోతుందని వారు చెబుతున్నారు.

ఇక తెలుగు రాష్ట్రాలపై చలి ప్రతాపం చూపుతోంది. తెలంగాణలో మరో 2 రోజులు పాటు పలు జిల్లాల్లో శీతల గాలులు వీచే ఛాన్స్ ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోని ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో శీతల గాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపింది. 

Tags:    

Similar News