PM Kisan: లక్షలాది మంది రైతులకు అదిరే వార్త..వెయ్యికోట్లతో మోదీ సర్కార్ మరో అద్భుత స్కీమ్
PM Kisan: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాయి. ఈ మేరకు రైతులను ఆర్థికంగా ఆదుకోవడంతోపాటు వారికి కీలక పథకాలను అమలు చేస్తున్నాయి. ఇప్పటికే కేంద్రంలోని మోదీ సర్కార్ పీఎం కిసాన్ వంటి స్కీములను అన్నదాతలకు అందిస్తూ ఆర్థిక సాయం అందిస్తున్నారు. తాజా మరో కీలక నిర్ణయం తీసుకుంది మోదీ ప్రభుత్వం.
కొత్తగా క్రెడిట్ గ్యారెంటీ స్కీమును ప్రారంభించింది. ఈ స్కీము ద్వారా దేశంలోని లక్షలాది మంది రైతులు నేరుగా లబ్ది పొందుతున్నారు. ఈ స్కీముకు సంబంధించి కీలక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. రైతులకు పంట తర్వాత రుణం అందే విధంగా చూడటమే ఈ క్రెడిట్ గ్యారెంటీ స్కీము ప్రధాన లక్ష్యం. పంట చేతికొచ్చిన తర్వాత గోదాముల్లో ఉంచిన ధాన్యాలు, ఎలక్ట్రిక్ గిడ్డంగుల రశీదులను సద్వినియోగం చేసుకుంటూ వీటి ద్వారా కూడా రైతులకు రుణం అందే విధంగా చూడాలని కేంద్ర ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. దీనికి కోసం వెయ్యి కోట్ల క్రెడిట్ గ్యారెంటీ స్కీమును ప్రారంభించినట్లు తెలిపింది ప్రభుత్వం.
వేర్ హౌసింగ్ డెవలప్ మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ రిజిస్టర్డ్ రిపోజిటరీలు జారీ చేసిన ఎలక్ట్రానిక్ నేగోసియన్ వేర్ హౌజ్ రసీదులకు లోన్ ఇవ్వడానికి బ్యాంకులు విముఖతను తగ్గించడం ఈ స్కీము మరో లక్ష్యం. ప్రస్తుతం ఈఎన్ డబ్య్లూఆర్ కింద రుణం కేవలం రూ. 4వేల కోట్లు. వచ్చే పదేళ్లేలో ఈ లోన్స్ రూ. 5.5 లక్షలకు పెంచాలని భావిస్తోంది ప్రభుత్వం. ఈ మేరకు గిడ్డంగి రిజిస్ట్రేషన్ పెంచాల్సిన అవసరం ఉందని ఇ కిసాన్ ఉపాజ్ నిధి ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్స్ ను క్రమబద్ధీకరించడం, గ్యారెంటీ క్రెడిట్ గురించి రైతులకు అవగాహన కల్పించడం, డిపాజిటరీ ఛార్జీలను సమీక్షించడం వంటివి చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.