Vijay Criticises Amit Shah: అమిత్ షా వ్యాఖ్యలపై తమిళ నటుడు విజయ్ కౌంటర్
Tamil actor turned politician TVK chief Vijay Criticises Amit Shah: రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌పై కేంద్ర హోమంత్రి అమిత్ షా (Amit Shah) చేసిన వ్యాఖ్యలపై తమిళ హీరో, తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు విజయ్ (Actor turned politician Vijay) ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. కొంతమందికి అంబేద్కర్ పేరు అంటే గిట్టదు అంటూ విమర్శలు చేశారు. అంబేద్కర్ భారత పౌరులందరికీ స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించిన సాటిలేని రాజకీయ మేధావి. ఆయన అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి. సామాజిక న్యాయానికి ప్రతీక. అంబేద్కర్.. అంబేద్కర్.. అంబేద్కర్ అని ఆయన పేరు అంటే మనసు, పెదవులకు సంతోషంగా ఉంటుందని విజయ్ తెలిపారు.
ఇదిలా ఉండగా విజయ్ ఇటీవల తమిళగ వెట్రి కళగం పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. పార్టీ మొదటి ర్యాలీలో బాబా సాహెబ్ అంబేద్కర్, పెరియార్ ఈవీ రామస్వామి, కె. కామరాజ్ వంటి మహానీయుల ఆశయాలతో పార్టీని ముందుకు తీసుకెళ్తామని విజయ్ తెలిపారు. మరోవైపు విజయ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
బుధవారం రాజ్యాంగంపై చర్చ సందర్బంగా రాజ్యసభలో మాట్లాడిన అమిత్ షా.. ఈమధ్య అంబేద్కర్.. అంబేద్కర్.. అంబేద్కర్ అని అనడం ఫ్యాషన్ అయింది. అన్నిసార్లు దేవుడి పేరు స్మరించి ఉంటే స్వర్గానికి చేరుకునేవారని అన్నారు. అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. సభలోనే కాకుండా బయట కూడా నిరసనలు వ్యక్తం చేశారు. అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించారని అమిత్ షా బదులిచ్చారు. నేనెప్పుడూ అంబేద్కర్‌కు వ్యతిరేకంగా మాట్లాడలేదని నా వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించిందన్నారు. ఆ పార్టీ అవాస్తవాలను ప్రచారం చేస్తోందని అమిత్ షా ఆరోపించారు. నా స్పీచ్‌ను ఎడిట్ చేసి ప్రజలకు షేర్ చేస్తోందన్నారు. నా స్పీచ్ మొత్తం వినాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని.. అప్పుడు నిజమేంటో అర్థమవుతుందన్నారు. కలలో కూడా అంబేద్కర్‌ను కించపరచని పార్టీ నుంచి తాను వచ్చానని అన్నారు. తన స్పీచ్‌ను ఎడిట్ చేసి సర్క్యూలేట్ చేస్తున్న కాంగ్రెస్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని తెలిపారు. మొత్తానికి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ( What Amit Shah said about Ambedkar) రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి.