Priyanka Slams BJP: అమిత్ షాను కాపాడేందుకు రాహుల్ పై ఆరోపణలు
పార్లమెంటు ప్రాంగణంలో (Parliament) రాహుల్ గాంధీ నెట్టడం వల్లే తమ ఎంపీలు గాయపడ్డారని బీజేపీ ఆరోపిస్తున్న నేపథ్యంతో దీనిపై ఎంపీ ప్రియాంక గాంధీ స్పందించారు(MP Priyanka Gandhi responded BJP's allegation). కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కాపాడేందుకే తన సోదరుడు, ఎంపీ రాహుల్ గాంధీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. డాక్టర్ బీఆర్. అంబేద్కర్ ఫొటోను పట్టుకుని జై భీమ్ అని నినాదాలు చేస్తూ శాంతియుతంగా పార్లమెంటులోకి ప్రవేశిస్తున్నాం. అదే సమయంలో వారు ఆందోళనకు దిగారు. అప్పుడే ఈ ఘటన చోటుచేసుకుంది. అమిత్ షాను కాపాడేందుకే ఈ ప్రయత్నాలు మొదలుపెట్టారని ప్రియాంక ఆరోపించారు.
రాహుల్ (Rahul Gandhi) ఎవరినో తోసేశారంటూ ఆరోపణలు చేస్తున్నారని.. కానీ తమ ముందే ఖర్గేని (Kharge) తోశారు.. ఆయన నేలపై పడిపోయారు. తర్వాత సీపీఎం ఎంపీని నెడితే ఆయన ఖర్గేపై పడిపోయారన్నారని ఆమె వివరించారు. ఇదంతా ఒక కుట్ర. వారి నిజమైన సెంటిమెంట్ ఈ రోజు బయటపడిందన్నారు.
పార్లమెంటు ప్రాంగణంలో గురువారం గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. రాజ్యాంగ నిర్మాత బీఆర్. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ఎంపీలు నిరసన చేపట్టారు. అటు అంబేద్కర్ (Ambedkar issue)ను కాంగ్రెస్ అవమానించిందంటూ ఆరోపిస్తూ అధికార పార్టీ ఎంపీలు సైతం నిరసనకు దిగారు. ఇరువర్గాల నిరసనలతో పార్లమెంటు ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో బీజేపీ ఎంపీలు స్వల్పంగా గాయపడ్డారు. అయితే రాహుల్ తోయడం వల్లే వారు గాయపడ్డారని బీజేపీ ఆరోపిస్తోంది