Tashi Namgyal: కార్గిల్ లో పాక్ సైన్యం చొరబాటును గుర్తించిన పశువుల కాపరి తాసి నామ్ గ్యాల్ మృతి
తాసి నామ్ గ్యాల్ (Tashi Namgyal) లడక్ లో మరణించారు. ఆయన భారత్ లోకి పాకిస్తాన్ సైనికులు చొరబాట్ల గురించి భారత ఆర్మీకి (Indian Army) సమాచారం ఇచ్చారు.
తాసి నామ్ గ్యాల్ (Tashi Namgyal) లడక్ లో మరణించారు. ఆయన భారత్ లోకి పాకిస్తాన్ సైనికులు చొరబాట్ల గురించి భారత ఆర్మీకి (Indian Army) సమాచారం ఇచ్చారు. తాషి పశువుల కాపరి.
ఆర్యన్ వ్యాలీ నుంచి కార్గిల్ సెక్టార్ (Kargil) లోకి పాకిస్తాన్ నుంచి చొరబాట్లను బయటపెట్టారు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు భారత సైనికులు ఈ విషయాన్ని ధృవీకరించుకున్నాయి.
పాకిస్తాన్ పై భారత్ యుద్ధానికి దిగింది. 1999 మే నుంచి జులై 26 వరకు కార్గిల్ యుద్ధం సాగింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్ ఓటమిని అంగీకరించింది. ఈ ఏడాది ద్రాస్ లో నిర్వహించిన కార్గిల్ విజయ్ దివస్ లో తాసి తన కూతురితో కలిసి పాల్గొన్నారు.
పాకిస్తాన్ సైన్యాన్ని ఎలా గుర్తించారంటే?
తన పశువులు తప్పిపోవడంతో తాసి వాటిని వెతుకుతూ వెళ్లారు. బటాలిక్ పర్వత ప్రాంతాల్లో బంకర్లు తవ్వుతున్న కొందరిని తాసి గుర్తించారు.వారి వస్త్రధారణను బట్టి తాసి వారిపై అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే ఆయన ఆర్మీకి సమాచారం ఇచ్చారు.