Post office: రూ. 5 లక్షలతో రూ. 15 లక్షలు పొందే అవకాశం. బెస్ట్ స్కీమ్‌..

Best Post office Savigs schemes: పోస్టాఫీస్ అందిస్తోన్న బెస్ట్‌ పథకాల్లో పోస్టాఫీస్‌ టైమ్‌ డిపాజిట్ స్కీమ్‌ ఒకటి. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మెరుగైన వడ్డీని పొందొచ్చు.

Update: 2024-12-22 16:15 GMT

Best Post office Savigs schemes: ప్రస్తుతం ఆర్థిక అవసరాలు మారుతున్నాయి. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పొదుపు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. బ్యాంకులు మొదలు పోస్టాఫీస్‌ల వరకు ఇందుకోసం రకరకాల పథకాలను అందిస్తున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ పోస్టాఫీస్‌ మంచి పథకాలను అందిస్తున్నాయి. మీ డబ్బుకు రక్షణతో పాటు అధిక రాబడి వచ్చే పథకాలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. అలాంటి ఒక బెస్ట్ పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పోస్టాఫీస్ అందిస్తోన్న బెస్ట్‌ పథకాల్లో పోస్టాఫీస్‌ టైమ్‌ డిపాజిట్ స్కీమ్‌ ఒకటి. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మెరుగైన వడ్డీని పొందొచ్చు. రూ. 5 లక్షలు పెట్టుబడి పెట్టడం ద్వారా రూ. 15 లక్షలు పొందే అవకాశం ఈ పథకంతో అందించారు. ఇంతకీ రూ. 15 లక్షలు పొందాలంటే ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదాహరణకు మీరు ఈ పథకంలో రూ. 5 లక్షల పెట్టుబడి పెడితే.. 5 సంవత్సరాల FDపై 7.5 శాతం వడ్డీని ఇస్తోంది.

అంటే ఐదేళ్ల తర్వాత మెచ్యూరిటీతో కలిపి మొత్తం రూ.7,24,974 అవుతుంది. అయితే ఈ మొత్తాన్ని తీసుకోకుండా మరో ఐదేళ్లు పెట్టుబడిని పొడగించుకోవచ్చు. ఇలా పదేళ్లలో 5 లక్షల మొత్తంపై వడ్డీ ద్వారా రూ. 5,51,175 పొందుతారు. అంటే మొత్తం రూ. 10,51,175 అవుతుంది. అనంతరం 5 సంవత్సరాలకు చేయాలంటే రాబడిని రెండు భాగాలు విభజించి మళ్లీ డిపాజిట్ చేయాలి. ఇలా చేయడం ద్వారా మెచ్యూరిటీ సమయంలో మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం 5 లక్షలపై వడ్డీ నుండి మాత్రమే రూ.10,24,149 పొందవచ్చు.

ఇలా మీరు పెట్టుబడి పెట్టిన రూ. 5 లక్షలకు అదనంగా.. రూ. 10,24,149 కలుపుకొని మొత్తం రూ. 15,24,149 అవుతుంది. ఇలా రూ. 5 లక్షలను ఎలాంటి రిస్క్‌ లేకుండా రూ. 15 లక్షలుగా మార్చుకోవచ్చన్నమాట. పోస్టాఫీస్‌ టైమ్ డిపాజిట్‌ను రెండుసార్లు మాత్రమే పొడగించే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే పోస్టాఫీస్‌ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు మనం పెట్టుబడి పెట్టే వ్యవధి ఆధారంగా మారుతుంది. ఒక ఏడాది డిపాజిట్‌పై 6.9 శాతం, రెండు సంవత్సరాల ఎఫ్‌డీపై 7.0 శాతం వార్షిక వడ్డీ, మూడు సంవత్సరాల ఎఫ్‌డీపై 7.1 శాతం వార్షిక వడ్డీ, ఐదు సంవత్సరాల టీడీపై 7.5 శాతం వార్షిక వడ్డీ పొందొచ్చు.

Tags:    

Similar News