శాంతిభద్రతల విషయంలో రాజీ లేదు: కాకినాడలో పవన్
కాకినాడలో పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతాకాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కోట్ల మంది బలిదానాలను ఈ రోజు మనం గుర్తుకు తెచ్చుకోవాలన్నారు.ఎందరో త్యాగధనులతోనే మనకు స్వాతంత్ర్యం వచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఇవాళ్టి నుంచి అన్న క్యాంటీన్లను పున:ప్రారంభిస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. రాజీలేని ధోరణితో శాంతిభద్రతలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో స్పష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సూపర్ సిక్స్ అమలు, రాష్ట్ర పున: నిర్మాణం కోసం ముందుకెళ్తున్నామని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత సామాజిక పెన్షన్లు పెంచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
Update: 2024-08-15 04:15 GMT