Independence Day 2024: లైవ్ అప్‌డేట్స్.. దేశ వ్యాప్తంగా అంబరాన్నంటిన మువ్వన్నెల సంబురాలు

Update: 2024-08-14 14:33 GMT
Live Updates - Page 3
2024-08-15 03:05 GMT

వికసిత భారత్‌ మనందరి లక్ష్యం



2047 నాటికి వికసిత భారత్‌ మనందరి లక్ష్యమని ప్రధాని తెలిపారు. భారత్‌ను ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా మార్చాలని.. తయారీరంగంలో గ్లోబల్‌ హబ్‌గా భారత్‌ని తీర్చిదిద్దాలన్నారు. ప్రపంచానికే అన్నంపెట్టే స్థాయికి భారత్‌ ఎదగాలని.. దేశాభివృద్ధికి పాలనా సంస్కరణలు అవసరమన్నారు. న్యాయవ్యవస్థలో సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. అంతరిక్షంలో భారత స్పేస్‌స్టేషన్‌ త్వరలో సాకారం కావాలన్నారు. మనం అనుకుంటే 2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని చెప్పారు. వికసిత భారత్‌ 2047 నినాదం 140కోట్ల మంది కలల తీర్మానమని.. దళితులు, పీడితులు, ఆదివాసీలు గౌరవంగా బతకాలన్నారు. వోకల్‌ ఫర్‌ లోకల్‌ అనేది ప్రభుత్వ వ్యూహమని.. వోకల్‌ ఫర్‌ లోకల్‌ నినాదం ఆర్థిక వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చిందని చెప్పారు.

2024-08-15 02:56 GMT

మోదీ కీలక సందేశం

స్వాతంత్య్ర సమరయోధులకు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది. వారి త్యాగాలను స్మరించుకునే రోజు ఇది. 20వ శతాబ్దపు తొలి నాళ్లలో 40 కోట్ల మంది భారతీయులు ఒక్కతాటిపైకి వచ్చి దేశం నుంచి బ్రిటీష్ పాలనను తరిమికొట్టారు. అప్పుడు 40 కోట్ల మంది జనాభా ఉన్నారు. నేడు మనం 140 కోట్ల మంది జనాభా ఉన్నాం. 40 కోట్ల మంది ఆ నాడు కష్టమైన పనిని సాధించి చూపారు. నేడు 140 కోట్ల మంది మనం దేశాన్ని ముందుకు సాగించగలం. నాడు ఆ 40 కోట్ల మందిలో చాలా మంది స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల కోసం ప్రాణాలు అర్పించారు. నేడు 140 కోట్ల మంది దేశం కోసం బతకాలి. దేశాన్ని ముందుకు నడిపించాలి’’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

2024-08-15 02:53 GMT

దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం

హర్‌ ఘర్‌ తిరంగా పేరుతో ఘనంగా వేడుకలు -మోడీ

భారత ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకం -మోడీ

దేశం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుందాం -మోడీ

ఎన్నో త్యాగాల ఫలితమే ఈ స్వాతంత్ర్య వేడుకలు -మోడీ

కొన్నేళ్లుగా విపత్తులు దేశాన్ని ఇబ్బంది పెట్టాయి -మోడీ

విపత్తు బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి -మోడీ

2047 నాటికి వికసిత్ భారత్ మనందరి లక్ష్యం -మోడీ

భారత్‌ను ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా మార్చాలి -మోడీ

తయారీరంగంలో గ్లోబల్‌ హబ్‌గా భారత్‌ను మార్చాలి -మోడీ

శతాబ్దాల తరబడి దేశం బానిసత్వంలో మగ్గింది -మోడీ

స్వాతంత్ర్యం కోసం ఆనాడు 40 కోట్ల మంది ప్రజలు పోరాడారు -మోడీ

ఇప్పుడు మన దేశ జనాభా 140 కోట్లకు చేరింది -మోడీ

ఈ 140 కోట్ల జనం వారి కలలను సాకారం చేయాలి -మోడీ

లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలి -మోడీ

ప్రపంచానికే అన్నం పెట్టే స్థాయికి భారత్‌ ఎదగాలి -మోడీ

దేశాభివృద్ధికి పాలనా సంస్కరణలు అవసరం -మోడీ

న్యాయవ్యవస్థలో సంస్కరణలు అవసరం -మోడీ

అంతరిక్షంలో భారత స్పేస్‌ స్టేషన్‌ త్వరలో సాకారం కావాలి -మోడీ

వికసిత్‌ భారత్‌ 2047 నినాదం.. 140 కోట్ల మంది కలల తీర్మానం -మోడీ

దళితులు, పీడితులు, ఆదివాసీలు గౌరవంగా బతకాలి -మోడీ

వోకల్‌ ఫర్‌ లోకల్‌ అనేది ప్రభుత్వ వ్యూహం -మోడీ

సర్జికల్‌ స్ట్రయిక్స్‌ను దేశ ప్రజలు సగర్వంగా స్మరించుకుంటున్నారు -మోడీ

అభివృద్ధి బ్లూప్రింట్‌గా సంస్కరణలు తీసుకొస్తున్నాం -మోడీ

నేషన్‌ ఫస్ట్‌.. రాష్ట్ర్‌ హిత్‌ సుప్రీం సంకల్పంతో ముందుకెళ్తున్నాం -మోడీ

భారత్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థ ప్రపంచంలోనే బలమైంది -మోడీ

జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా 15 కోట్ల మందికి లబ్ధి -మోడీ

ఉపాధి కల్పనలో గణనీయమైన ప్రగతి సాధించాం -మోడీ

యువతకు నూతన ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి -మోడీ

అన్నిరంగాల్లో ఆధునిక సాంకేతికతకు పెద్దపీట వేస్తాం -మోడీ

త్వరలోనే భారత్‌.. ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుంది -మోడీ

అంతరిక్ష రంగంలో భారత్‌ బలమైన శక్తిగా ఎదిగింది -మోడీ

భారీ సంస్కరణలు తెచ్చేందుకు ప్రభుత్వం సంకల్పించింది -మోడీ

2024-08-15 02:04 GMT

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్..

ఉదయం 8:30 గంటలకు గాంధీ భవన్ లో జెండా ఆవిష్కరణ..

9.20 కి పరెడ్ గ్రౌండ్ చేరుకొని సైనికుల స్మారకానికి నివాళులు అర్పిస్తారు.

ఉదయం 10 గంటలకు గోల్కొండ కోటకు చేరుకొని పోలీసు గౌరవ వందనం స్వీకరిస్తారు.

అనంతరం కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు.

తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

స్వాతంత్య్ర వేడుక సంబురాల్లో పాల్గొని.. అనంతరం పలువురికి సేవా,పురస్కార పథకాలు అందజేస్తారు

గోల్కొండ కోట జెండా వందనం కార్యక్రమం అనంతరం..

ఉదయం 11.45 గంటలకు బేగం పేట విమానాశ్రయం నుండి భద్రాద్రి కొత్త గూడెం జిల్లాకు బయలుదేరుతారు.

బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి మధ్యాహ్నం 12:50 గంటలకు భద్రాద్రి కొత్త గూడెం జిల్లాకు చేరుకుంటారు.

పుసుగూడెం వద్ద సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పైలాన్ ఆవిష్కరణ,అనంతరం పంప్ హౌజ్ స్విచ్ ఆన్ చేసి..అక్కడే మీడియాతో మాట్లాడతారు.

అనంతరం ఖమ్మం జిల్లా వైరా చేసుకొని...మూడో విడత 2లక్షల వరకు ఉన్న రైతు రుణమాఫీ ప్రారంభించి అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

2024-08-15 02:03 GMT

ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ

ర్ర కోట వేదికగా 78వ స్వాతంత్య్ర దినోత్సోవ వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రధాని మోదీ మొదట రాజ్‌ ఘాట్‌ వద్ద మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అనంతరం ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయజెండాను ఎగురవేశారు.

2024-08-14 15:33 GMT

స్వాంతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు

 

ఎందరో మహనీయుల పోరాటాలు, మరెందరో బలిదానాల ఫలితంగా సాధించుకున్న దేశ స్వాతంత్ర్యం

స్వాతంత్ర్య ఫలాలు చివరి గడపకూ చేరిన నాడే సంపూర్ణ సార్థకత చేకూరుతుంది

మహాత్మా గాంధీ నడిపించిన భారత స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో శాంతియుత మార్గం లో సాధించుకున్నం మన తెలంగాణ రాష్ట్రం

రాష్ట్ర ప్రజల సహకారం తో పదేండ్ల అనతికాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలిచింది

అన్ని రంగాల్లో సబ్బండ వర్గాల అభ్యున్నతి దిశగా దేశ పాలకుల కార్యాచరణ మరింత చిత్తశుద్ధి తో అమలు చేయాలి

స్వాతంత్ర్య పలితాలు అందరికి అందడమే పోరాట త్యాగధనులకు మనం అర్పించే ఘన నివాళి

2024-08-14 15:20 GMT

పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత బృందాలకు కూడా ఆహ్వానం పంపింది. ఎర్రకోట వేదికగా జరగనున్న వేడుకలకు దాదాపు 400 మంది పంచాయతీరాజ్‌ సంస్థల మహిళా ప్రతినిధులను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించినట్లు సంబంధిత మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

2024-08-14 15:20 GMT

ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. వివిధ రంగాల్లో రాణించిన, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారిలో కొందరిని కేంద్రం ప్రత్యేక అతిథులుగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించింది.

2024-08-14 15:19 GMT

78వ స్వాతంత్ర వేడుకల నిర్వహణకు ఢిల్లీలోని ఎర్రకోట ముస్తాబైంది. వేడుకలకు దాదాపు 6 వేల మంది ప్రత్యేక అతిథులకు ఆహ్వానం అందింది. 

2024-08-14 15:19 GMT

78వ స్వాతంత్ర వేడుకలకు ఎర్రకోట ముస్తాబు

Tags:    

Similar News