Live Updates: ఈరోజు (13 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 13 నవంబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-11-13 01:30 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం | 13 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | త్రయోదశి: సా.4-08 తదుపరి చతుర్దశి | చిత్త నక్షత్రం రా.10-28 తదుపరి స్వాతి | వర్జ్యం ఉ.7-32 నుంచి 9-02 వరకు తిరిగి తె.3.41 నుంచి 5.10 వరకు | అమృత ఘడియలు సా.4-30 నుంచి 5-59 వరకు | దుర్ముహూర్తం ఉ.8-21 నుంచి 9-06 వరకు .12-06 నుంచి 12-51 వరకు | రాహుకాలం ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.06-07 | సూర్యాస్తమయం: సా.05-21

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-11-13 12:48 GMT

 గుంటూరు.. మంగళగిరి

- ఈ ఘటనపై ఆరా తీస్తున్న హాస్పిటల్ యాజమాన్యం.

- గైనిక్ వార్డులోని ac outdoor unit కి గ్యాస్ ఫీల్ చేస్తున్న సమయంలో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది , ఇద్దరికి గాయాలు ఒకరు మృతి

2020-11-13 12:03 GMT

 జాతీయం

- భారత్ - పాకిస్థాన్ సరిహద్దు లో పాకిస్థాన్ బంకర్లు ధ్వంసం చేసిన భారత ఆర్మీ

- కుప్వారా సెక్టార్లో పాకిస్థాన్ ఆర్మీ పోస్ట్ , బంకర్లు ధ్వంసం. ఈ దాడిలో పాకిస్థాన్ ఆయుధాల డిపో తో సహా , ఇంధన డిపో ధ్వంసం

- 14 మంది ఉగ్రవాదులతోపాటు , 6 గురు పాకిస్థాన్ ఆర్మీ కమెండోలు హతం.

2020-11-13 05:26 GMT

 విశాఖ

-భారత వాలీబాల్‌ సమాఖ్య ఉపాధ్యక్షునిగా విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పి.జి.వి.ఆర్‌.నాయుడు (గణబాబు) నియమితులయ్యారు.

-ప్రస్తుతం ఆయన రాష్ట్ర వాలీబాల్‌ సంఘానికి అధ్యక్షునిగా ఉన్నారు.

-ఆయన్ని పలు క్రీడా సంఘాల ప్రతినిధులు అభినందించారు.

2020-11-13 05:24 GMT

 కర్నూలు జిల్లా

- నంద్యాల ఎన్జీవోస్ కాలనీ లో వెంకట కృష్ణ (23) అనే యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య...

- కాళ్లకు చేతులకు కట్టుకొని రూమ్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య...

- సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఆత్మహత్య కు కారణాలను దర్యాప్తు చేస్తున్న టూ టౌన్ పోలీసులు...

2020-11-13 05:17 GMT

-hmtv తో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి

-శాసనసభ్యులు తమ,తమ నియోజకవర్గాల్లో సమస్యలపై ఆ సమావేశంలో చర్చించాం.

-ప్రభుత్వ భూములు ఆక్రమణలు చేసేవారిని ఉపేక్షించేది లేదు.

-ఎంతటి వారిపైనా చట్టపరమైనచర్యలు తీసుకుంటాం.

-మూడు రాజధానులపై కొన్ని తప్పుడు ప్రచారం చేస్తున్నాయి.

-విశాఖను కాలుష్య రహిత నగరంగా మార్చనున్నాం.

-ప్రపంచంలోనే విశాఖపట్నం గొప్పనగరంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది.

-రాబోయే ఐదు సంవత్సరాల్లో విశాఖ మరింత అభివృద్ధి చెందుతుంది.

-విశాఖలో 200 చెరువులను కనులకు విందుగా ఉండేవిధంగా వసతి కల్పించనున్నాం.

2020-11-13 05:10 GMT

నెల్లూరు:

-- ఇన్ ఫ్లో 7640 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో 3620 క్యూసెక్కులు.

--  ప్రస్తుత నీటి మట్టం 75.218 టిఎంసిలు. పూర్తి నీటి మట్టం 77.988 టీఎంసీలు.

--  తెలుగుగంగ కండలేరు జలాశయం లో ప్రస్తుత నీటి మట్టం 60.231 టీఎంసీలు.

--  ఇన్ ఫ్లో 2,865 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో 3,675 క్యూసెక్కులు.

2020-11-13 05:06 GMT

అనంతపురం:

- తన ప్రేమకి అడ్డుచెబుతున్నారని అమ్మాయి కుటుంబ సభ్యుల పై బాబా అనే వ్యక్తి కత్తి తో దాడి.

- అల్లావుద్దీన్ అనే వ్యక్తి కత్తిపోట్ల తో అక్కడికక్కడే మృతి.

- పరారీ లో యువతి, యువకుడు.

- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

2020-11-13 05:00 GMT

తిరుమల

- శ్రీవారి దర్శనార్థం ఈరోజు తిరుమలకు రానున్న కేంద్ర హోంశాఖ సహయ మంత్రి కిషన్ రెడ్డి.

- రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు.

2020-11-13 04:57 GMT

 గుంటూరు...

- దిగ్బంధానికి ఎలాంటి అనుమతులు లేవంటున్న పోలీసులు

- ఎలా అయినా చేసి తీరుతాం అంటున్న జిల్లా పల్నాడు సాధన సమితి

2020-11-13 04:55 GMT

 విశాఖ

-ఆర్కే బీచ్ రోడ్ లో విశాఖపట్నం మహానగరపాలిక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ విశాఖ మార ధాన్ కార్యక్రమం ప్రారంభం

-కాళీమాత టెంపుల్ నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు వాక్ ధాన్

-ముఖ్య అతిధిగా ఎంపీ విజయసాయిరెడ్డి హాజరు

-ఎంపీ సత్యనారాయణ ఎమ్మెల్యే లు గుడివాడ అమర్ నాధ్,కరణం ధర్మ శ్రీ వైసీపీనేతలు, జివిఎంసి కమిషనర్ సృజన హాజరు

Tags:    

Similar News