AP Budget Live Updates: బడ్జెట్ లైవ్ అప్‌డేట్స్.. ఏ శాఖకు ఎంత కేటాయించారంటే..?
Andhra Pradesh Budget 2024-25 Live Updates: రూ. 2.94 లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్.
AP Budget Live Updates: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. పది రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇవాళ జరిగే బీఏసీ సమావేశంలో ఈ విషయమై నిర్ణయం తీసుకుంటారు. అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని వైఎస్ఆర్ సీపీ నిర్ణయం తీసుకుంది. అయితే శాసనమండలికి మాత్రం ఆ పార్టీ సభ్యులు హాజరుకానున్నారు.
రూ.2.94 లక్షలతో ఏపీ వార్షిక బడ్జెట్
రూ. 2.94 లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్.
అసెంబ్లీ సమావేశాలకు ముందుగా జరిగిన కేబినెట్ సమావేశంలో బడ్జెట్ కు ఆమోదం తెలిపారు.
ఎన్ జీ రంగా యూనివర్శిటీ- రూ.507.038 కోట్లు
ఉద్యాన యూనివర్శిటీ- రూ. 102.227 కోట్లు
శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్శిటీ- రూ. 171.72 కోట్లు
ఉచిత వ్యవసాయ విద్యుత్ - రూ.7241.30 కోట్లు
ఉపాధి హామీ అనుసంధానం- రూ.5,150 కోట్లు
నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణ - రూ.14, 637.03 కోట్లు
పంటల భీమా- రూ.1,023 కోట్లు
వ్యసాయశాఖ- రూ.8,564.37 కోట్లు
ఉద్యానవనశాఖ- రూ.3,469.47 కోట్లు
డిజిటల్ వ్యవసాయం- రూ.44.77 కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణ- రూ.187.68 కోట్లు
పట్టు పరిశ్రమ- రూ.108.44 కోట్లు
వ్యవసాయ మార్కెటింగ్- రూ.314.8 కోట్లు
అన్నదాత సుఖీభవ- రూ.4,500 కోట్లు
వడ్డీ లేని రుణాలు - రూ.628 కోట్లు
సహకార శాఖ- 308.26 కోట్లు
ఇంటిగ్రేటేడ్ అగ్రి ల్యాబ్స్ - రూ.44.03 కోట్లు
రైతు సేవా కేంద్రాలు- రూ.26.92 కోట్లు
పొలం పిలుస్తోంది- రూ.11.31 కోట్లు
రూ.43, 4202 కోట్లతో వ్యవసాయ బడ్జెట్
రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక
62 శాతం జనాభాకు వ్యవసాయ అనుబంధ రంగాలే ఆధారం
వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం వ్యవసాయాన్ని గాలికి వదిలేసింది
భూసార పరీక్షలకు తిరిగి ప్రాధాన్యం ఇస్తున్నాం
భూసార పరీక్షలకు రిమోట్ సెన్సింగ్ సాంకేతికత ఉపయోగిస్తాం
విత్తనాలు, సూక్ష్మ పోషక ఎరువులపై రాయితీలు
రాయితీ పత్తి విత్తనాలకు రూ.240 కోట్లు
పీఎసీఎస్ ల ద్వారా ఎరువుల పంపిణీ
పయ్యావుల కేశవ్... తొలిసారి మంత్రి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయాల్లో కేశవ్ కు మంత్రి పదవి దక్కలేదు. 2024 మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ దఫా తెలుగుదేశంలో సీనియర్లను చంద్రబాబు పక్కన పెట్టారు. మంత్రివర్గంలో కూడా కొత్తవారికి అవకాశం కల్పించారు. 2019-24 వరకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులుగా ఆయన కొనసాగారు.
ఈసారి చంద్రబాబు కేబినెట్ లో పయ్యావుల కేశవ్ కు అవకాశం దక్కింది. ఆర్ధిక శాఖ ఆయనకు దక్కింది. తొలిసారిగా ఆయన ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ టీ ఆర్ బతికున్న సమయంలో పయ్యావుల కేశవ్ కి 1994లో టీడీపీ టిక్కెట్టు లభించింది. ఆ ఎన్నికల్లో ఆయన గెలిచారు.1999 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. 2004, 2009 ఎన్నికల్లో ఆయన గెలిచారు.2014 ఎన్నికల్లో ఆయన ఓడారు. 2019, 2024 ఎన్నికల్లో గెలిచారు.
మహిళ, శిశు సంక్షేమం-రూ.4,285 కోట్లు
మైనార్టీ సంక్షేమం- రూ.4,376 కోట్లు
నైపుణ్యాభివృద్ది-రూ.1,215 కోట్లు
పాఠశాల విద్య- రూ. 29,909 కోట్లు
ఎస్టీ సంక్షేమం- రూ. 7557 కోట్లు
బీసీ సంక్షేమం - రూ.39,007 కోట్లు
ద్రవ్యలోటు రూ.68, 743 కోట్లు
జీఎస్ డీపీలో రెవిన్యూ లోటు అంచనా 4.19 శాతం
రెవిన్యూ అంచనా వ్యయం-2.34 లక్షల కోట్లు
రెవిన్యూ లోటు- 34,743 కోట్లు
జీఎస్ డీపీలో రెవిన్యూ లోటు అంచనా 4.19 శాతం
ఉన్నత విద్య రూ.2,3236 కోట్లు
ఆరోగ్య రంగం- రూ.18, 241 కోట్లు
పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ- రూ.16, 739 కోట్లు
పట్టణాభివృద్ధి శాఖ-రూ.11,490 కోట్లు
గృహ నిర్మాణం -రూ.4,012 కోట్లు
నీటిపారుదల శాఖ-రూ.16,705 కోట్లు
పరిశ్రమలు, వాణిజ్యం-రూ.3,127 కోట్లు
ఉన్నత విద్య- రూ.2,3236 కోట్లు
ఇంధనరంగం- రూ.8,207 కోట్లు
రోడ్లు, భవనాలు-రూ.9,554 కోట్లు
యువజన, పర్యాటక , సాంస్కృతిక శాఖ- రూ. 322 కోట్లు
పోలీస్ శాఖ -రూ.8,495 కోట్లు
పర్యావరణం, అటవీశాఖ -రూ.687 కోట్లు