Top 25 News @2 PM: తెలంగాణకు కాంగ్రెస్ పాలన శాపంగా మారింది... ఎక్స్‌లో కేటీఆర్ ఫైర్

Top 25 News Headlines Today, 22 October 2024: టాప్ 25 హెడ్ లైన్స్ @ 2PM

Update: 2024-10-22 08:34 GMT

1. తెలంగాణకు అసమర్ధ, అవినీతి పాలన శాపంగా మారింది.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్‌లో మాజీమంత్రి కేటీఆర్ ఫైర్.

2. సియోల్‌లో తెలంగాణ మంత్రుల బృందం పర్యటన.. నేడు హన్‌రివర్‌ను సందర్శించనున్న మంత్రులు.

3. ఈనెల 23న ఏపీ కేబినెట్ భేటీ.. ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వ శాఖలకు నోట్‌ పంపిన సీఎస్‌.

4. ఏలూరు జిల్లాలో మంత్రి నాదెండ్ల పర్యటన..కలెక్టరేట్‌లో మంత్రి సమీక్షా సమావేశం.

5. రేపు గుంటూరు, కడప జిల్లాల్లో వైఎస్‌ జగన్‌ పర్యటన..బద్వేల్‌లో బాలిక కుటుంబాన్ని పరామర్శించనున్నమాజీ సీఎం.


6. పీఏబీఆర్ జలాశయాన్ని పరిశీలించిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. ఫిల్టర్ బెడ్‌ల నాణ్యత, నీటి వివరాలను తెలుసుకున్న మంత్రి.

7. ఇచ్చిన హామీలు నెరవేర్చే సత్తా లేదు..కూటమి ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డ మాజీ మంత్రి కాకాణి

8. విజయవాడలో నేడు, రేపు జాతీయ స్థాయి డ్రోన్ సమ్మిట్.. ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్

9. నేడు తెలంగాణలో రెండో రోజు గ్రూప్‌-1 పరీక్షలు.. మధ్యాహ్నం.2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష

10. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్.. రెండు చోట్ల దొంగతనాలకు ప్రయత్నం.

11. తిరుపతి జిల్లాలో పురివిప్పిన పాత కక్షలు.. నాంచారంపేట దళితవాడకు చెందిన హరిప్రసాద్ దారుణ హత్య.

12. బోరబండలో డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్ల పేరుతో మోసం..కోటి రూపాయలకు పైగా వసూలు చేసిన కేటుగాడు.

13. బంగాళాఖాతంలో వాయుగుండం..మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక.

14. సుంకేసుల ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద ఉధృతి.. సుంకేసుల ప్రాజెక్ట్‌ 10 గేట్లు ఎత్తి శ్రీశైలం ప్రాజెక్ట్‌కు నీటి విడుదల.

15. హైటెక్స్ లో ఈ నెల 25 నుండి 27వరకు ప్రాపర్టీ షో.. నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో బ్రోచర్ ఆవిష్కరణ.

16. ఎక్సైజ్ పోలీసుల దాడిలో పట్టుబడ్డ గంజాయి డ్రగ్స్ ధ్వంసం... సుమారు రూ.3 కోట్ల విలువైన గంజాయి, డ్రగ్స్ కాల్చివేత.

17. రష్యాలో నేటి నుంచి రష్యాలో బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.. బ్రిక్స్‌ సదస్సుకు హాజరుకానున్న భారత ప్రధాని మోడీ.

18. రేపు వయనాడ్‌లో ప్రియాంకగాంధీ నామినేషన్‌.. నామినేషన్‌లో పాల్గొననున్న సోనియా, రాహుల్‌, ఖర్గే.

19. ఈనెల 24న కేంద్ర హోంశాఖ కీలక భేటీ.. ఏపీ తెలంగాణ అపరిషృత అంశాలపై చర్చ.

20. కశ్మీర్ ఎప్పటికీ పాక్‌లో భాగం కాదు.. ఉగ్రవాదాన్ని అంత చేసే సమయం వచ్చిందన్న ఫరుక్ అబ్దుల్లా.

21. ఛత్తీస్‌గఢ్‌లో భద్రతాదళాలు- మావోయిస్టులకు మధ్య కాల్పులు.. నలుగురు మావోయిస్టులు మృతి.

22. భారత్-చైనా సరిహద్దులో బలగాల ఉపసంహరణకు అంగీకారం.. వాస్తవాధీన రేఖ వెంట పెట్రోలింగ్ పునఃప్రారంభానికి సిద్ధం.

23. అయిదుగురు బంధీలను విడుదల చేస్తే రెండు వారాల కాల్పుల విరమణ.. హమాస్ కు ఇజ్రాయెల్ కొత్త ప్రతిపాదన.

24. అండమాన్ సముద్రంలో పడవ మునక.. 8 మంది మృతి 20 మంది గల్లంతు.

25. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.

Tags:    

Similar News