Maharashtra, Jharkhand Election Results Live: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్డేట్స్

Maharashtra, Jharkhand Election Results 2024 Live Updates: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని 48 శాసనసభ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా.. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది.

Update: 2024-11-23 05:19 GMT

Live Updates: Maharashtra, Jharkhand Election Results 2024

Maharashtra, Jharkhand Election Results 2024 Live Updates: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని 48 శాసనసభ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా.. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. మీ కోసం లైవ్ అప్డేట్స్

Live Updates
2024-11-23 07:36 GMT

Maharashtra Election Results 2024: మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో మధ్యాహ్నం 12 గంటల సమయానికే మహాయుతి కూటమి 222 స్థానాల్లో విజయం సాధించింది. మహారాష్ట్రలో ఒక కూటమి 200 స్థానాలకుపైగా స్థానాల్లో విజయం సాధించడం ఇదే తొలిసారిగా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మహారాష్ట్రలో అధికారంలోకి రావాలంటే 145 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. కానీ మహాయుతి అంతకుమించిన ఘన విజయం సొంతం చేసుకుంది. మహాయుతి కూటమిలో బీజేపి, సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఉన్నాయి.

ఈ కూటమిలో బీజేపి 149 స్థానాల్లో పోటీచేయగా కడపటి వార్తలు అందే సమయానికి 128 స్థానాల్లో విజయం సాధించింది. ఇది ఆ పార్టీకి అతి పెద్ద విజయంగానే చెప్పుకోవచ్చు. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీ 81 స్థానాల్లో పోటీ చేస్తే 53 స్థానాల్లో గెలిచింది. అజిత్ పవార్ వర్గమైన ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేస్తే 36 మంది అభ్యర్థులు గెలిచారు.

మహా వికాస్ అఘాడి కూటమిలో కాంగ్రెస్, ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన పార్టీ, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఉన్నాయి. ఈ కూటమి కేవలం 53 స్థానాలతో విజయానికి దూరంగా చాలా వెనుకంజలో ఉంది. కూటమి కాకుండా ఉన్న ఇతర పార్టీల అభ్యర్థులు 12 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

మహా వికాస్ అఘాడి కూటమి విషయానికొస్తే... కాంగ్రెస్ పార్టీ 101 స్థానాల్లో బరిలోకి దిగితే కేవలం 19 స్థానాల్లోనే ముందంజలో ఉంది. ఉద్ధవ్ థాకరే శివసేన వర్గం 95 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 13 స్థానాల్లోనే ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక శరద్ పవార్ వర్గంలో ఉన్న ఎన్సీపీ అభ్యర్థులు 86 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 19 స్థానాల్లోనే విజయం సాధించారు.

ఏక్‌నాథ్ షిండే థానెలోని కోప్రి-పచ్‌పఖాడి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఆయనకు పోటీగా థాకరే శివసేన నుండి కేదార్ డిఘె బరిలో ఉన్నారు. కానీ ఏక్‌నాథ్ షిండేకు గట్టి పోటీని ఇవ్వడంలో కేదార్ బాగా వెనుకపడ్డారు. ఎందుకంటే ఓట్ల లెక్కింపు చేపట్టిన తొలి రౌండ్ల నుండే ఏక్‌నాథ్ షిండే వేల సంఖ్యలో మెజార్టీతో ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చారు.

ఇదే మహాయుతి కూటమిలో భాగస్వామిగా ఉన్న డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కూడా తొలి రౌండ్ నుండే ఆధిక్యంలో ఉంటూ వచ్చారు. మహారాష్ట్రలోని బారామతి నియోజవర్గం పవార్ కుటుంబానికి కంచుకోట లాంటిది. ఆ కంచుకోటలో పవార్ కుటుంబంలోనే ఇద్దరు పవార్లు పోటీపడ్డారు. అజిత్ పవార్‌పై శరద్ పవార్ మనవడు యుగేంద్ర పవార్ బరిలో నిలిచారు. కానీ ఇక్కడ అజిత్ పవార్‌దే పైచేయి అయింది.

మాజీ సీఎం ఉద్ధవ్ థాకరే వారసుడు ఆదిత్య థాకరే ముంబైలోని వొర్లి నుండి పోటీ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత మిలింద్ దేవ్‌ర షిండే సేనలో చేరి ఇక్కడ పోటీకి దిగారు. వీరిలో ఆదిత్య థాకరే 650 ఓట్లతో ముందంజలో ఉన్నారు.

అక్టోబర్ 12న దారుణహత్యకు గురైన మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖి వారసుడు జీషాన్ సిద్ధిఖి బాంద్రా ఈస్ట్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఉద్ధవ్ థాకరే మేనల్లుడు వరుణ్ సర్దేశాయ్ 5000 ఓట్లతో జీషాన్ సిద్ధిఖిపై పైచేయి సాధించారు.

మహారాష్ట్ర కాబోయే సీఎం ఎవరు?

మహాయుతి కూటమిలో బీజేపికే అధిక స్థానాల్లో విజయం సాధించినందున ఆ పార్టీ నేతకే సీఎం అవకాశం ఉంది. దేవేంద్ర ఫడ్నవిస్ నాగపూర్ నార్త్ వెస్ట్ నియోజకర్గం నుండి పోటీ చేశారు. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి ప్రఫుల్లపై 10 వేల ఓట్లతో ముందంజలో ఉన్నారుయ. మహారాష్ట్ర సీఎం రేసులోనూ మాజీ సీఎ దేవేంద్ర ఫడ్నవిస్ ముందంజలో కనిపిస్తున్నారు. ఇప్పటికే బీజేపిలో ప్రవీణ్ దరేకర్ వంటి పలువురు నేతలు దేవేంద్ర ఫడ్నవిసే తమ నాయకుడు అని బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. బీజేపి అధిష్టానం కూడా ఆయన వైపే ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. 2014 ఎన్నికల్లో బీజేపి 122 స్థానాల్లో విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో 105 స్థానాలతోనే సరిపెట్టుకున్న బీజేపి ఈసారి ఏకంగా 127 స్థానాలకు పెరిగింది.

2024-11-23 06:53 GMT

మహారాష్ట్రలో అధికారం నిలబెట్టుకునే దిశగా మహాయుతి కూటమి దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఫడ్నవీస్‌ నివాసంలో బీజేపీ నేతలు సమావేశమయ్యారు. ఫడ్నవీస్‌ సీఎం పదవి చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఫడ్నవీస్‌ సీఎం అంటూ మహా బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేస్తుండటంతో మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. సీఎం సీటు వదులుకునే ప్రసక్తే లేదంటోంది షిండే వర్గం. దీంతో.. మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. 

2024-11-23 06:20 GMT

జార్ఖండ్‌లో జేఎంఎం కూటమికి మెజారిటీ వచ్చిన తర్వాత, రాంచీలో కాంగ్రెస్ కీలక సమావేశం జరుగుతోంది. జేఎంఎం కూటమి 47 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అదే సమయంలో బీజేపీ కూటమి 31 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

2024-11-23 06:18 GMT

మహారాష్ట్ర తదుపరి సీఎంగా దేవంద్ర ఫడణవీస్ బాధ్యతలు స్వికరించే అవకాశం

స్పష్టం చేసిన బీజేపీ నేత ప్రవీణ్ ధరేకర్

కాసేపట్లో ఫడణవీస్‌తో మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వాంఖలే భేటీ

2024-11-23 06:03 GMT

శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఈవీఎంలు ట్యాంపరింగ్‌ చేసి గెలిచారంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో అఘాడీ కూటమికే మెజార్టీ సీట్లు వచ్చాయని, ఇప్పుడెలా ఫలితాలు మారుతాయంటూ తన అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇది ప్రజా తీర్పు కాదని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు.

2024-11-23 06:02 GMT

మహారాష్ట్రలో బీజేపీ చరిత్ర సృష్టించింది -బండి సంజయ్‌

మోడీ అభివృద్ధి మంత్రం పనిచేసింది -బండి సంజయ్‌

ప్రజలు ఎన్డీయే కూటమికి పట్టం కట్టారు -బండి సంజయ్‌

గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధిస్తాం -బండి సంజయ్‌

రేవంత్‌ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్‌ ఓడిపోయింది -బండి

2024-11-23 05:54 GMT

పూణే, బల్లార్ పూర్, షోలాపూర్, డెత్లూర్, లాతూర్ లలో పూణే, బల్లార్ పూర్, షోలాపూర్ లో బీజేపీ కూటమి అభ్యర్థులు ముందంజ

డెత్లూర్, లాతూర్ లలో మాత్రం హోరాహోరీ పోరు

2024-11-23 05:39 GMT

మేద్నీపూర్‌ బైపోల్ ఎన్నికలో టీఎంసీ అభ్యర్థి సుజయ్‌హజ్రా ఆధిక్యం

నైహతిలో సనత్ దే లీడ్

మదారిహత్‌లో జయప్రకాశ్ టొప్పొ ముందంజ

సితాయ్‌ అసెంబ్లీ స్థానంలో సంగీతా రాయ్‌ లీడ్

2024-11-23 05:38 GMT

ఉత్తరప్రదేశ్ లో మొత్తం 9 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు.. బీజేపీ-6, ఎస్పీ-2, ఆర్ఎల్డీ-1 స్థానంలో ముందంజ

2024-11-23 05:37 GMT

జార్ఖండ్‌లో మ్యాజిక్‌ ఫిగర్‌ 41 స్థానాలు దాటేసిన ఇండియా కూటమి

వెనుకబడ్డ బీజేపీ కూటమి

50 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న ఇండియా కూటమి

Tags:    

Similar News