Election Results 2024: తెలంగాణ లోక్‌సభ ఫలితాలు.. కౌంటింగ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌..

తెలంగాణ లోక్‌సభ ఫలితాలు.. కౌంటింగ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌..

Update: 2024-06-04 04:08 GMT

Election Results 2024: తెలంగాణ లోక్‌సభ ఫలితాలు.. కౌంటింగ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌..


Live Updates
2024-06-04 09:51 GMT

త‌న‌ను న‌మ్మి ఓటు వేసిన ప్ర‌జ‌లంద‌రికీ పెద్ద‌ప‌ల్లి ఎంపీ అభ్య‌ర్థి గ‌డ్డం వంశీకృష్ణ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. గెలుపు ఖాయం అయిన అనంత‌రం కౌంటింగ్ సెంట‌ర్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప్ర‌జ‌లంద‌రికీ హృద‌య పూర్వ‌క ధ‌న్య‌వాదాలు తెలిపారాయ‌న‌. పెద్ద ఎత్తున పార్ల‌మెంట్ ప‌రిధిలో ఆశీర్వ‌దించారని, త‌న‌ను న‌మ్మిన వారికి కచ్చితంగా న్యాయం చేస్తాన‌ని వెల్ల‌డించారు.

2024-06-04 09:27 GMT

నల్గొండ లో‌ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గా రఘువీర్ రెడ్డి గ్రాండ్ విక్టరీ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా ప్రకటన.

నల్గొండ ఎంపీ స్థానానికి ఇంచార్జ్ గా ఉండటం ,దేశంలోనే రికార్డు స్థాయి మెజారిటీ రావడం చాలా సంతోషంగా ఉంది.

5.75 లక్షల మెజారిటీ అంటే నల్గొండ పార్లమెంటు ప్రజలు కాంగ్రెస్ తోనే ఉన్నారు.

ఇక తన నియోజకవర్గం లో 1.1 లక్షల మెజారిటీ రావడం సంతోషంగా ఉందన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి.

దేశంలోనే ఓక నియోజకవర్గం లో ఇంత మెజారిటీ ఏ పార్టీ కి ఎక్కడ కూడా రాలేదని ప్రకటన.

2024-06-04 09:16 GMT

భువనగిరి ఎంపీ అభ్యర్థి గా చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు

1,80,000 మెజారిటీతో బీజేపీ అభ్యర్థి బూర నరసయ్యగౌడ్ పై గెలుపు.

2024-06-04 09:11 GMT

నాగర్ కర్నూల్:- 79,182 ఓట్ల మెజారిటీతో మల్లు రవి విజయం

2024-06-04 09:05 GMT

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కామెంట్స్...

అన్ని వర్గాల ప్రజలు నేడు బీజేపీ కి మద్దతుగా నిలిచారు

మోడీని బలపర్చారు

ఇది ప్రజల విజయం

తన గెలుపు కోసం పనిచేసిన వారికి ధన్యవాదాలు

మోడీ హయాంలో దేశం మరింత ప్రగతి సాదిస్తుంది

2024-06-04 08:57 GMT

13వ రౌండ్ ముగిసేసరికి 13,774 ఓట్లతో ముందంజలో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ.

బిజెపి - 3,40,604 కాంగ్రెస్ - 3,26,830 బీఆర్ఎస్ - 1,05,523

2024-06-04 08:57 GMT

జహీరాబాద్‌లో సురేష్ షెట్కార్ విజయం

జహీరాబాద్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్ధి సురేష్ షెట్కార్ విజయం

2024-06-04 08:31 GMT

నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి కామెంట్స్...

బీజేపీ, బి.ఆర్.ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పోటీ జరిగింది

బీజేపీ, బి.అర్.ఎస్ ఒక్కటై కాంగ్రెస్ ను ఓడించారు

నా ఓటమిని అంగీకరిస్తున్న

ఎంపీగా గెలిచిన అరవింద్ కు అభినందనలు

నిజామాబాద్ లో స్మార్ట్ సిటీ ఏర్పాటు తో పాటు పసుపు బోర్డు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి

2024-06-04 07:35 GMT

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఖమ్మం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రామసహాయం రఘురామిరెడ్డి విజయం సాధించారు.

2024-06-04 06:20 GMT

బీజేపీ ఈటెల రాజేందర్-297160

కాంగ్రెస్ సునీత - 179597

బిఅరెస్ లక్ష్మారెడ్డి - 90795

1లక్ష17.563 ఓట్ల ఆధిక్యంలో బిజెపి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్.

Tags:    

Similar News