Allu Arjun Case: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై సెలబ్రిటీలకు, బౌన్సర్లకు సీపీ సీరియస్ వార్నింగ్
Allu Arjun case latest news updates: అల్లు అర్జున్ ఆరోపణలపై తెలంగాణ డీజీపీ జితేందర్, హైదరాబాద్ సీపీ సీవి ఆనంద్, ఏసీపీ విష్ణు మూర్తి స్పందించారు.
Hyderabad CP CV Anand's reply to Allu Arjun allegations: అల్లు అర్జున్ కేసులో శనివారం కీలక పరిణామాలు చోటుచసుకున్నాయి. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అసలు పోలీసులు తనకేమీ చెప్పలేదని అల్లు అర్జున్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఇదే విషయమై తెలంగాణ డీజీపీ జితేందర్, హైదరాబాద్ సీపీ సీవి ఆనంద్, ఏసీపీ విష్ణు మూర్తి స్పందించారు.
సంధ్య థియేటర్ యాజమాన్యం చెబితేనే తాను థియేటర్ నుండి వెళ్లిపోయానని అల్లు అర్జున్ చెప్పిన మాటలకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వీడియో ఫూటేజ్ తో బదులిచ్చారు.
పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా డిసెంబర్ 4 నాడు రాత్రి సంధ్య థియేటర్ వద్ద ఏం జరిగిందో మీరే చూడండి అంటూ మీడియా ఎదుట వీడియో ప్రదర్శించారు. అల్లు అర్జున్ థియేటర్లోకి రావడం, తిరిగి వెళ్లడం, వెళ్లేటప్పుడు డీసీపీ కూడా ఉన్న దృశ్యాలను చూపించారు. బౌన్సర్లకు వెంటపెట్టుకుని వచ్చి అల్లు అర్జున్ తొక్కిసలాటకు కారణమైనట్లు తెలిపారు. బౌన్సర్లు వేసే వేషాలకు సెలబ్రిటీలే బాధ్యులు అవుతారని సీవీ ఆనంద్ హెచ్చరించారు. అల్లు అర్జున్ కేసులో కోర్టులో న్యాయ పోరాటం చేస్తామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.