Allu Arjun press meet: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలకు కౌంటర్‌గా అల్లు అర్జున్ ప్రెస్‌మీట్.. అసలేం జరిగిందంటే..

Update: 2024-12-21 14:00 GMT

Allu Arjun comments on Telangana CM Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అల్లు అర్జున్‌పై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం, ఆ తరువాత ఇదే కేసులో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం, ఆ మరునాడు ఆయన బెయిల్‌పై చంచల్ గూడ జైలు నుండి బయటికి రావడం వంటి పరిణామాలు ఒకదాని తరువాత మరొకటి సంచలనం సృష్టించాయి.

అల్లు అర్జున్ జైలు నుండి విడుదలైన మరుక్షణం నుండే అనేక మంది సెలబ్రిటీలు ఆయన ఇంటికి క్యూ కట్టి వరుస పరామర్శలు జరిపారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ, బీజేపి నేతలు కూడా అల్లు అర్జున్ అరెస్టును ఖండిస్తూ రేవంత్ రెడ్డి సర్కారుపై ఆరోపణలు చేశారు. అల్లు అర్జున్ అభిమానులు కొంతమంది రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు.

ఈ విషయాలన్నింటిని ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి తన అసెంబ్లీ స్పీచ్‌లో అల్లు అర్జున్ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. ఆయన్ను పరామర్శించిన సినీ, రాజకీయ ప్రముఖులను కూడా నిలదీశారు. అల్లు అర్జున్ ను పరామర్శించిన వారిలో ఏ ఒక్కరూ కూడా మృతురాలు రేవతి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వైరల్ (Revanth reddy comments on Allu Arjun) అవుతున్న నేపథ్యంలో తాజాగా అల్లు అర్జున్ కూడా మీడియా ద్వారా తన అభిప్రాయాలను తెలియజేసేందుకు ఇవాళ రాత్రి 7 గంటలకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు (Allu Arjun press meet over CM Revanth Reddy's allegations on him). అల్లు అర్జున్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన ఈ మీడియా సమావేశం కోసం ఇప్పటికే భారీ సంఖ్యలో మీడియా ప్రతినిధులు చేరుకున్నారు. ప్రస్తుతం మనం ఆ దృశ్యాలను లైవ్‌లో చూస్తున్నాం. 

Full View


Tags:    

Similar News