ACP Vishnu Murthy Slams Allu Arjun: అల్లు అర్జున్‌కు ప్రెస్ మీట్ పెట్టే హక్కుందా.. మేం తల్చుకుంటే... ఏసీపీ సంచలన వ్యాఖ్యలు
ACP Vishnu Murthy counter to Allu Arjun: పోలీసులను తిడుతున్నారు. ఒక్క 10 నిమిషాలు మేం ఉద్యోగాలు చేయమని వదిలిపెట్టిపోతే మీ బతుకులు ఎక్కడుంటాయో ఆలోచించుకోండి - ఏసీపీ విష్ణుమూర్తి
ACP Vishnu Murthy counter to Allu Arjun: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై, పోలీసులపై శనివారం అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ద్వారా చేసిన వ్యాఖ్యలకు ఇవాళ చిక్కడపల్లి ఏసీపీ విష్ణు మూర్తి స్పందించారు. గత 15 రోజులుగా పోలీసుల మీద కొంతమంది కావాలనే బండలు వేస్తున్నారని ఏసీపీ విష్ణుమూర్తి. ప్రజలను రక్షించడంలో నిమగ్నమై ఉన్న పోలీసుల మీద అవాకులు చెవాకులు పేలుతున్నారన్నారు. డబ్బుతో మదమెక్కిన బడాబాబులు పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని తెలిపారు. సొంత కుటుంబాల కోసం సమయం వెచ్చించకుండా ప్రజల కోసం సేవ చేస్తోన్న పోలీసులను తిడుతున్నారు. ఒక్క 10 నిమిషాలు మేం ఉద్యోగాలు చేయమని వదిలిపెట్టిపోతే మీ బతుకులు ఎక్కడుంటాయో ఆలోచించుకోండి అని ఏసీపీ హెచ్చరించారు.
అల్లు అర్జున్ వైఖరిపై, ఆయన నటించిన పుష్ప సినిమాలో ఎర్ర చందనం స్మగ్లింగ్ పై, పోలీస్ ఆఫీసర్ ను బట్టలూడదీసే సన్నివేశాలపై ఏసీపీ విష్ణు మూర్తి చాలా ఘాటుగా స్పందించారు.