Gudihatnoor Incident: గుడిహత్నూర్‌లో తీవ్ర ఉద్రిక్తత... స్థానికుల దాడిలో సీఐ, ఎస్ఐకి గాయాలు

Update: 2024-12-21 16:54 GMT
Gudihatnoor Incident: గుడిహత్నూర్‌లో తీవ్ర ఉద్రిక్తత... స్థానికుల దాడిలో సీఐ, ఎస్ఐకి గాయాలు
  • whatsapp icon

Villagers attack on Ichoda CI and SI in Gudihatnur mandal in Adilabad district: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌లో శనివారం రాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఒక యువకుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలు రావడంతో స్థానికులు ఆ యువకుడి ఇంటిపై దాడికి పాల్పడ్డారు. యువకుడిపై దాడి చేసిన అనంతరం ఆయన ఇంటికి నిప్పుపెట్టారు.

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని బాలికను ఆస్పత్రికి తరలించారు. అదే సమయంలో గ్రామస్తుల దాడిలో గాయపడిన యువకుడిని కూడా పోలీసులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. దాంతో స్థానికులు పోలీసులపై కూడా దాడికి పాల్పడ్డారు. పోలీసు వాహనం అద్దాలు పగలగొట్టారు. స్థానికుల దాడిలో ఇచ్చోడ సీఐ, ఎస్ఐలకు గాయాలయ్యాయి. దీంతో గుడిహత్నూరులో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

గ్రామస్తుల దాడిలో గాయపడిన ఇచ్చోడ సీఐ, ఎస్ఐని పోలీసులు చికిత్స కోసం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అక్కడే పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి అదనపు బలగాలను మొహరించారు. 

Tags:    

Similar News