
Balakrishna's residence: బాలకృష్ణ ఇంటి ఎదుట కారు ప్రమాదం.. ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు
Road accident in front of Balakrishna's residence: హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 1 లో ఉన్న బాలకృష్ణ ఇంటి ఎదుట కారు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన ఒక కారు అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న ఫుట్‌పాత్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఫుట్‌పాత్‌కు రోడ్డుకు మధ్యలో ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ దెబ్బతింది. ఫెన్సింగ్ ను ఢీకొట్టిన తరువాత ఫుట్‌పాత్ ను ఢీకొని ఆగిపోయింది.
పోలీసులు చెప్పిన వివరాల కారు డ్రైవర్ ప్రకారం రోడ్ నెంబర్ 45 నుండి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సాధారణంగా ఈ రోడ్డు ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. కానీ ప్రమాదం జరిగిన సమయంలో రోడ్డుపై ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
A speeding car crashed into the footpath and a fence outside actor Balakrishna's Jubilee Hills residence. #balakrishna #Hyderabad@TOIHyderabad pic.twitter.com/busjfiOraZ
— Pinto Deepak (@PintodeepakD) March 14, 2025
జూబ్లీహిల్స్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.