Half Day Schools: తెలంగాణలో విద్యార్థులకు గుడ్ న్యూస్..రేపటి నుంచి ఒంటిపూట బడులు

Half Day Schools: తెలంగాణలో విద్యార్థులకు గుడ్ న్యూస్..రేపటి నుంచి ఒంటిపూట బడులు
Half Day Schools: తెలంగాణలోని విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. ఎండల తీవ్రత నేపథ్యంలో రాష్ట్రంలో బడులను ఒంటిపూట నడపాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వ, ఎయిడెడ్ , ప్రైవేట్ పాఠశాలలను ఈనెల 15వ తేదీ నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారు. మధ్యాహ్న భోజనాన్ని 12.30 గంటల సమయం అందిస్తారు.
పదవ తరగతి పరీక్షాకేంద్రాలున్న బడుల్లో మాత్రం మధ్యాహ్నం 1 గంటల నుంచి 5గంటల వరకు పాఠశాలలను నిర్వహిస్తారు. పదో తరగతి పరీక్షలు ముగిసిన తర్వాత మళ్లీ ఉదయం పూట ఆయా బడులు నడుస్తాయి. పదో తరగతి ప్రత్యేక క్లాసులు యాధావిధిగా నడుస్తాయి.
అటు ఏపీలోనూ ఒంటిపూడ బడుల నిర్వహణపై నిర్ణయం తీసుకుంది విద్యాశాఖ. మార్చి 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సారి ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని విద్యాశాఖకు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏప్రిల్ 24నుంచి జూన్ 12 వ తేదీ వరకు వేసవి సెలవులను ఖరారు చేశారు.