TGPSC Group-3 Results: తెలంగాణ గ్రూప్ 3 ఫలితాలు విడుదల

TGPSC Group-3 Results: తెలంగాణలో గ్రూప్-3 ఫలితాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం విడుదల చేసింది.

Update: 2025-03-14 10:24 GMT
TGPSC Group-3 Results: తెలంగాణ గ్రూప్ 3 ఫలితాలు విడుదల
  • whatsapp icon

TGPSC Group-3 Results: తెలంగాణలో గ్రూప్-3 ఫలితాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం విడుదల చేసింది. 2024 నవంబర్ లో గ్రూప్ 3 పరీక్షలు జరిగాయి. మార్కులు, జనరల్ ర్యాంకుల జాబితాను విడుదల చేశారు.గ్రూప్ -3 ఉద్యోగాలకు 5,36, 400 మంది ధరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 1365 పోస్టుల కోసం 2024 నవంబర్ 17,18 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. 50.24 శాతం మంది అభ్యర్ధులు ఈ పరీక్షలు రాశారు.

గ్రూప్ 3 పరీక్ష ఫలితాల కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్ సైట్ www.tspsc. gov, in లోకి వెళ్లి ర్యాంకులు చెక్ చేసుకోవచ్చు.మార్చి 10, 11తేదీల్లో గ్రూప్ 1, 2 ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. గ్రూప్ 1 లో 563 పోస్టులు, గ్రూప్ 2 లో 783 పోస్టులు, గ్రూప్ 3లో 1365 పోస్టులను భర్తీ చేయనున్నారు. హాస్టల్ వేల్పేర్ ఆఫీసర్ పోస్టులు నిర్వహించిన పరీక్షల తుది ఫలితాలను మార్చి 7న, ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగ ఫలితాలను మార్చి 19న ప్రకటించనున్నారు.జాబితా ఆధారంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి మెరిట్ లిస్ట్ ను ప్రకటిస్తారు. ఈ లిస్ట్ ఆధారంగా జాబ్ పత్రాలను అందిస్తారు.

Tags:    

Similar News