Fire Accident: మాదాపూర్లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో మంటలు.. పరుగులు పెట్టిన ఉద్యోగులు
Fire Accident: హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఉన్న ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున మాదాపూర్ లోని ఇనార్బిట్ మాల్ ఎదురుగా ఉన్న సత్య భవనంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. క్రమంగా అవి బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా మంటలు అలుముకోవడంతో..ఉద్యోగులు భయంతో బయటకు పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. రెండు ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.