Telangana SSC Board Exams Schedule: తెలంగాణ పదో తరగతి పరీక్షల టైమ్ టేబుల్ వచ్చేసింది

Update: 2024-12-19 10:18 GMT

Telangana SSC board Exams schedule 2025: తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. 2025 మార్చి 21వ తేదీ నుండి తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు మొదలవనున్నాయి. ఏప్రిల్ 4వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నట్లు తెలంగాణ ఎస్ఎస్‌సి బోర్డు తెలిపింది.

మార్చి 21న ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్ష

మార్చి 22న  సెకండ్ లాంగ్వెజ్ పరీక్ష

మార్చి 24న ఇంగ్లీష్ ఎగ్జామ్ 

మార్చి 26న మ్యాథమెటిక్స్ (గణితం) పరీక్ష

మార్చి 28న ఫిజిక్స్ (భౌతిక శాస్త్రం) పరీక్ష

మార్చి 29న బయాలజీ (జీవశాస్త్రం) పరీక్ష

ఏప్రిల్ 2న సోషల్ స్టడీస్ (సాంఘీక శాస్త్రం) పరీక్ష

ఏప్రిల్ 3న ఒకేషనల్ కోర్స్ మొదటి పేపర్ పరీక్ష

ఏప్రిల్ 4న ఒకేషనల్ కోర్స్ రెండో పేపర్ పరీక్ష జరగనుంది.

Tags:    

Similar News