ACB Case on KTR: ప్రజలకు అర్థమయ్యేటట్లు చెబుతా... ఫార్ములా ఈ కార్ రేసింగ్ పై కేటీఆర్ ప్రెస్ మీట్
ACB Case on KTR: తనపై ఏసీబీ కేసు నమోదు చేసినట్లు వస్తోన్న వార్తలపై కేటీఆర్ స్పందించారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ పై ఆరోపణలు గురించి మీకు మీరే నాలుగు గోడల మధ్య కేబినెట్ లో చర్చించడం కాకుండా 4 కోట్ల మంది ప్రజలు చూసేలా అసెంబ్లీ సమావేశాల్లో చర్చ పెట్టమని కోరామన్నారు. తన డిమాండ్ కు ప్రభుత్వం నుంచి జవాబు పత్తా లేదని కేటీఆర్ అన్నారు. గురువారం రాత్రి తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
అసెంబ్లీ లో ఎవరికి వారే అరిచి గీపెట్టి బయటపడతారు తప్ప ఈ కేసు విషయంలో ప్రభుత్వం అర్థవంతమైన చర్చకు ముందుకు రావడం అని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వానికి ఈ విషయంలో చర్చకు వచ్చే దమ్ము లేదన్నారు. చర్చలో పాల్గొనే సత్తా లేదు... ముఖ్యమంత్రికి కళ్ళలో కళ్ళు పెట్టి ఈ కుంభకోణం జరిగిందని చెప్పి నిరూపించేంత శక్తి లేదని ఆయన అభిప్రయపడ్డారు.
ఏదో ఒక కేసు పెట్టాలన్న శాడిస్ట్ మెంటాలిటీ తప్ప ప్రభుత్వానికి మరో ఉద్దేశం లేదని కేటీఆర్ అన్నారు. అందుకే ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఏం జరిగిందో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలనే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.