Revanth Reddy: అరెస్టులను తప్పించుకొనేందుకే బీజేపీకి బీఆర్ఎస్ లొంగుబాటు
అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీకి బీఆర్ఎస్ లొంగిపోయిందని తెలంగాణ సీఎం ఎ.రేవంత్ రెడ్డి ఆరోపించారు.
అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీకి బీఆర్ఎస్ లొంగిపోయిందని తెలంగాణ సీఎం ఎ.రేవంత్ రెడ్డి ఆరోపించారు. మణిపూర్ అల్లర్లు, అదానీపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని కోరుతూ ఛలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.
రాజ్ భవన్ కు సమీపంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అంతకుముందు నెక్లెస్ రోడ్ నుంచి రాజ్ భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అదానీ, మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్ఎస్ ప్రజల వైపుందా అదానీ- మోదీ వైపు ఉందా అనేది చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
అదానీ విషయంలో జేపీసీకి బీఆర్ఎస్ పట్టుబట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయమై జేపీసీ వేయకపోతే రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామని ఆయన అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశ ప్రతిష్టను పెంచేందుకు ప్రయత్నిస్తే మోదీ అదానీ కలిసి దేశం పరువు తీశారని ఆయన ఆరోపించారు.