Digital Arrest: కంబోడియా కేంద్రంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న పాకిస్తానీయులు

డిజిటల్ అరెస్టుల(digital arrest) పేరుతో సైబర్ నేరగాళ్లు(cyber cheaters) రోజుకు రూ. 6 కోట్లను అమాయకుల నుంచి వసూలు చేస్తున్నారని పోలీసులు గుర్తించారు.

Update: 2024-12-18 08:57 GMT

Digital Arrest: కంబోడియా కేంద్రంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న పాకిస్తానీయులు

డిజిటల్ అరెస్టుల(digital arrest) పేరుతో సైబర్ నేరగాళ్లు(cyber cheaters) రోజుకు రూ. 6 కోట్లను అమాయకుల నుంచి వసూలు చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఈ ఏడాది 10 నెలల్లోనే రూ.2,140 కోట్లను కొల్లగొట్టారు. కంబోడియా (cambodia)కేంద్రంగా మోసగాళ్లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

 తెలంగాణ సైబర్ పోలీసుల విచారణలో కీలక విషయాలు

డిజిటల్ అరెస్టుల పేరుతో తమను సైబర్ మోసగాళ్ల వ్యవహారంపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో టీజీసీఎస్‌బీ(tgcsb) అధికారులు కీలక విషయాలను వెల్లడించారు. డిజిటల్ అరెస్టుల పేరుతో మోసగాళ్లకు పాల్పడే వారిలో ఎక్కువగా పాకిస్తాన్ (pakistan)దేశస్తులున్నారని తెలిపారు. అయితే ఉపాధి చూపిస్తామని ఆశ చూపి కొందరు భారతీయులను సైబర్ నేరాల్లో బలవంతంగా దించుతున్న విషయాన్ని కూడా సైబర్ పోలీసులు గుర్తించారు.పోలీసుల నుంచి తప్పించుకొనేందుకు కంబోడియాను కేంద్రంగా ఎంచుకున్నారని పోలీసులుచెబుతున్నారు. సైబర్ నేరాల్లో బలవంతంగా దిగిన భారతీయులు తమ ముఖాలు కన్పించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

కంబోడియాలో చైనా జాతీయులు సైబర్ క్రైమ్ డెన్ నిర్వహిస్తున్నారు. నేరాలకు పాల్పడుతున్నవారు తమ దేశాలకు చెందినవారిని టార్గెట్ చేసుకుంటున్నారు. ఫేక్ ఐపీఓ, పెట్టుబడుల స్కీమ్, ఫారెక్స్ ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. మయన్మార్,థాయ్ లాండ్ లలో 17 వేల వాట్సాప్ అకౌంట్స్ ల ద్వారా మోసగాళ్లు ఉపయోగిస్తున్నారు.

సైబర్ మోసాలపై ఎలా ఫిర్యాదు చేయాలి?

సైబర్ మోసాలపై 1930 ద్వారా మొబైల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. లేదా www.cybercime.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి కూడా బాధితులు కంప్లైంట్ చేసే అవకాశం ఉంది. 8712672222 నెంబర్ కు ఫోన్ చేసి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కు ఫిర్యాదు చేయవచ్చు.

Similar News