HYDRA: హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు
AV Ranganath: హైడ్రా ఏర్పడకముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు.
AV Ranganath: హైడ్రా ఏర్పడకముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. అంటే 2024 జులై తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని ఆయన అన్నారు. గతంలో అనుమతి తీసుకుని ఇప్పుడు నిర్మిస్తున్న నిర్మాణాల వైపు వెళ్లమని.. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వాటిని కూలుస్తామని ఆయన తెలిపారు. కొత్తగా తీసుకున్న అనుమతులను హైడ్రా పరిశీలిస్తుందన్నారు.
ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా చెరువుల పరిరక్షణకు హైడ్రా పనిచేస్తుందన్నారు రంగనాథ్. హైడ్రా పేదల జోలికి వెళ్లదని.. పేదల ఇళ్లను హైడ్రా కూల్చివేస్తుందనేది తప్పుడు ప్రచారమన్నారు. అలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని రంగనాథ్ కోరారు.