Assembly Session: నల్లచొక్కాలు, బేడీలతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

Assembly Session: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్లచొక్కాలు, చేతులకు బేడీలతో అసెంబ్లీకి వచ్చారు.

Update: 2024-12-17 05:33 GMT

Assembly Session: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్లచొక్కాలు, చేతులకు బేడీలతో అసెంబ్లీకి వచ్చారు. లగచర్ల కేసులో రైతు ఈర్యానాయక్ ను పోలీసులు బేడీలతో ఆసుపత్రికి తరలించడంపై నిరసనకు దిగారు. కేటీఆర్, హరీశ్ రావు సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులకు బేడీలు వేయడంపై ప్రభుత్వం తీరును తప్పుబట్టారు.

అసలు ఏం జరిగింది?

లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారులపై గ్రామస్తులు దాడికి ప్రయత్నించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ సహా ఇతర ఉన్నతాధికారులను పోలీసులు రక్షించారు. కడా అధికారి వెంకట్ రెడ్డిపై గ్రామస్తులు దాడికి దిగారు. ఈ ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 20 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో అరెస్టైన రైతులను సంగారెడ్డి జిల్లా జైలుకు తరలించారు. జైలులో ఛాతీనొప్పితో బాధపడుతున్న ఈర్యానాయక్ అనే రైతును సంగారెడ్డి ఆసుపత్రికి తరలించే సమయంలో జైలు అధికారులు బేడీలు వేసి తీసుకొచ్చారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణకు ఆదేశించారు.

Tags:    

Similar News