CP CV Anand: సంధ్య థియేటర్ కు షోకాజ్ నోటీసులు

Sandhya Theatre: సంధ్య థియేటర్ కు మంగళవారం హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

Update: 2024-12-17 12:10 GMT

CP CV Anand: సంధ్య థియేటర్ కు షోకాజ్ నోటీసులు

Sandhya Theatre: సంధ్య థియేటర్ కు మంగళవారం హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. డిసెంబర్ 4 రాత్రి పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సమయంలో థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మరణించారు. ఆమె కొడుకు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయమై థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలని నోటీసలు జారీ చేశారు. దీనిపై 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో కోరారు. ఇదే కేసులో హీరో అల్లు అర్జున్ ను డిసెంబర్ 13న అరెస్ట్ చేశారు.

కిమ్స్ లో శ్రీతేజ్ ను పరామర్శించిన హైదరాబాద్ సీపీ

డిసెంబర్ 4న తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పరామర్శించారు. వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నారు.ఆక్సిజన్ అందని కారణంగా బాలుడి బ్రెయిన్ డ్యామేజ్ అయిందని సీపీ తెలిపారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారని ఆయన అన్నారు.

Tags:    

Similar News