TG TET: తెలంగాణ టెట్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ టెట్ (TG TET) పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ పాఠశాల విద్యాశాఖ (Telangana schools education ) డైరెక్టర్ విడుదల చేశారు

Update: 2024-12-18 11:37 GMT

TG TET: తెలంగాణ టెట్ షెడ్యూల్ విడుదల


తెలంగాణ టెట్ (TG TET) పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ పాఠశాల విద్యాశాఖ (Telangana schools education ) డైరెక్టర్ విడుదల చేశారు. 2025 జనవరి 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రెండు సెషన్లలో పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4.30 వరకు పరీక్షలు జరగనున్నాయి.

8, 9, 10, 18 తేదీల్లో పేపర్-1 పరీక్షలను, జనవరి 2, 5, 11, 12, 19, 20వ తేదీల్లో పేపర్-2 నిర్వహించనున్నారు. ఈ సారి టెట్ పేపర్1, పేపర్2కి కలిపి మొత్తం 2.75 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

Similar News