Smita Sabharwal:కాళేశ్వరం కమిషన్ ముందు స్మితా సభర్వాల్ హాజరు
స్మితా సభర్వాల్ (Smita Sabharwal)కాళేశ్వరం కమిషన్ ముందు గురువారం హాజరయ్యారు. కాళేశ్వరం (kaleshwaram project) ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ (Pinaki Chandra Ghose)నేతృత్వంలోని కమిషన్ ను విచారిస్తోంది. .
స్మితా సభర్వాల్ (Smita Sabharwal)కాళేశ్వరం కమిషన్ ముందు గురువారం హాజరయ్యారు. కాళేశ్వరం (kaleshwaram project) ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ (Pinaki Chandra Ghose)నేతృత్వంలోని కమిషన్ ను విచారిస్తోంది. డిసెంబర్ 18 నుంచి ఈ విచారణ తిరిగి ప్రారంభమైంది. బహిరంగ విచారణను బుధవారం ప్రారంభించింది కమిషన్ .
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో స్మితా సభర్వాల్ సీఎంఓలో పనిచేశారు. సీఎంఓలో ఉంటూ ఇరిగేషన్ వ్యవహారాలను ఆమె పర్యవేక్షించేవారు. ఈ కారణంగానే కాళేశ్వరం ప్రాజెక్టు విచారణకు ఆమె హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అప్పట్లో తీసుకున్న నిర్ణయాలపై కమిషన్ ఆమెను ప్రశ్నించనుంది. మరో వైపు అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సోమేష్ కుమార్ కూడా విచారణకు హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి వ్యయం, ఇతర అంశాల గురించి చర్చించే అవకాశం ఉంది.
బుధవారం ఈ విచారణకు ఇరిగేషన్ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్(Rajat Kumar), ఎస్ కే జోషీ(SK Joshi) హాజరయ్యారు.కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అప్పట్లో తీసుకున్న నిర్ణయాలపై కమిషన్ విచారించింది.తుమ్మడిహెట్టి నుంచి నిర్మాణ ప్రదేశాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చిందని కమిషన్ అప్పటి ఇరిగేషన్ సెక్రటరీ ఎస్ కే జోషిని ప్రశ్నించింది. నీటి లభ్యతలను పరిశీలించిన తర్వాత ఏడాది పొడవున నీటి లభ్యత ఉన్న మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మాణాన్ని మార్చాల్సి వచ్చిందని ఆయన కమిషన్ కు వివరించారు. ఈ విషయంలో అప్పటి సీఎం కేసీఆర్(KCR) తుది నిర్ణయం తీసుకున్నారని జోషి వివరించారని సమాచారం.