Folk Singer Shurthi Suicide Case: ఫోక్ సింగర్ శృతిది హత్యా? ఆత్మహత్యా?

Update: 2024-12-18 17:06 GMT

Folk singer Shurthi's Suspicious death case: ఫోక్ సింగర్ శృతి చనిపోయారు. ఆమెది ఆత్మహత్య అని అత్తింటి వారు చెబుతున్నారు. కానీ శృతిది ఆత్మహత్య కాదు ముమ్మాటికే హత్యేనని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. శృతిని హత్య చేసి, ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పి గజ్వెల్ ప్రభుత్వాస్పత్రిలో పడేసి ఎక్కడికో పారిపోయారని ఆమె తల్లిదండ్రులు మీడియా ఎదుట వాపోయారు.

దయాకర్‌తో శృతి లవ్ మ్యారేజ్

నిజామాబాద్ జిల్లాకు చెందిన శృతి నవంబర్ 27న లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. సిద్ధిపేట జిల్లా పీర్లపల్లికి చెందిన దయాకర్ అనే యువకుడిని ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దయాకర్, శృతికి సోషల్ మీడియాలో పరిచయం అయ్యారు. వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దయాకర్, శృతి ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అనంతరం దయాకర్ ఆమెను తన ఇంటికి తీసుకెళ్లారు.

అత్తమామలు, భర్త వేధింపులే కారణమా?

శృతి ఆత్మహత్య వార్త తెలిసి ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. శృతి అత్తమామలు, ఆమె భర్త దయాకర్ కట్నం కోసం వేధించారని, తమ బిడ్డ ఆత్మహత్యకు వారే కారణమని శృతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై ఇప్పటికే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఫోక్ సింగర్ శృతి సూసైడ్ న్యూస్ ఆమె అభిమానులతో పాటు తోటి ఫోక్ సింగర్స్‌ను షాక్‌కు గురిచేసింది. ఎప్పుడూ చలాకీగా జానపద పాటలు పాడుతూ ఫోక్ సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శృతికి ఇప్పుడిలా జరిగిందంటే నమ్మలేకపోతున్నామని చెబుతున్నారు.

శృతి పెళ్లికి మేం ఒప్పుకున్నాం.. కానీ..

శృతిది ఆత్మహత్య కాదంటున్న ఆమె తల్లిదండ్రులు... ఆమె అత్తామామలు, భర్త కట్నం కోసం వేధించినట్లు చెబుతున్నారు. శృతి పెళ్లికి తాము అంగీకరించామని.. కానీ అదే సమయంలో శృతి వాళ్ల బాబాయి చనిపోవడంతో పెళ్లి వాయిదా పడిందన్నారు. కానీ ఆ తరువాత 3 రోజులకే శృతి ఇంట్లో చెప్పకుండా వెళ్లి రహస్యంగా పెళ్లి చేసుకున్నారని చెప్పారు. కట్నం కోసం తమ బిడ్డను బలి తీసుకుంటారనుకోలేదని బోరుమంటున్నారు.

గతంలో హెచ్ఎంటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శృతి ఎంతో చక్కగా పాటలు పాడారు. జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలన్న ఆమె కోరికను పంచుకున్నారు. కానీ ఉన్నట్లుండి ఇలా అర్థాంతరంగా అతి చిన్న వయస్సులోనే అందరికీ దూరమయ్యారు. శృతి హెచ్ఎంటీవీతో మాట్లాడిన ఆ వీడియో ఇక్కడ మీ కోసం. 

Full View


Tags:    

Similar News