OU JAC Attack on Allu Arjun's residence: అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసి దాడి

OU JAC Attack on Allu Arjun's residence: అల్లు అర్జున్ ఇంటిపై కోడిగుడ్లు , టమాటాలు , రాళ్లతో ఓయూ జేఏసి దాడి

Update: 2024-12-22 12:00 GMT

OU JAC Protests Against Allu Arjun: అల్లు అర్జున్ ఇంటి ఎదుట ఓయూ జేఏసీ విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. ఆయన ఇంటిపై కోడి గుడ్లు, టమాటలు, రాళ్లు రువ్వారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళా అభిమాని మృతికి అల్లు అర్జున్ కారణం అంటూ విద్యార్థి సంఘాల నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. రేవతి మరణానికి అల్లు అర్జున్ బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసి దాడి గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు భారీ సంఖ్యలో బలగాలను మొహరించారు. ఈ వివాదంపై ఇప్పటికే కేసు విచారణ కోర్టులో ఉన్నందున మీరు ఆందోళన విరమించాలని పోలీసులు ఓయూ జేఏసి నేతలను వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తున్నారు.

Tags:    

Similar News