Tollywood vs Telangana Govt? టాలీవుడ్ యూటర్న్? ఏపీకి సినీ పరిశ్రమ?

Tollywood vs Telangana Govt after Allu Arjun issue : ఏపీ నుంచి తెలుగు సినీ పరిశ్రమకు పిలుపు వచ్చింది. ఏపీకి రండి అని సినీ పరిశ్రమను అక్కడి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో పాటు మంత్రులు, రాజకీయ నేతలు ఆహ్వానిస్తున్నారు.

Update: 2024-12-23 09:45 GMT

Tollywood vs Telangana Govt?: గత కొంతకాలంగా తెలంగాణ సర్కార్‌కు, సినీ పరిశ్రమకు పొసగడంలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరుగుతున్న ఘటనలనే అందుకు ఉదాహరణలుగా విశ్లేషకులు చెబుతున్నారు. రేవంత్ సర్కార్‌తో ఢీ అంటే ఢీ అనే స్థాయిలో కొన్ని ఘటనలు జరిగాయంటున్నారు. దీంతో సినీ పరిశ్రమను ఏపీకి తరలించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి ఏపీ రాజకీయ నేతలు మాట్లాడుతున్న వ్యాఖ్యలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

తెలుగు పరిశ్రమ ప్రస్తుతం పాన్ వరల్డ్ స్థాయికి ఎదిగింది. అలాంటి సినీ పరిశ్రమ హైదరాబాద్ కేంద్రంగా కొనసాగుతోంది. అయితే కొన్నాళ్లుగా తెలుగు సినీ పరిశ్రమకు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయనే వాళ్లు కూడా లేకపోలేదు. కావాలనే వేధింపులకు గురి చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. అందులో భాగంగానే అక్కినేని నాగార్జున N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత, అల్లు అర్జున్ వ్యవహారం లాంటివి ఉదాహరణలుగా చెప్పుకుంటున్నారు.

గతంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉద్యమ సమయంలో ఒక ప్రాంతానికే సినీ పరిశ్రమ మద్దతు పలుకుతుందనే కారణంతో నాడు సినీ పరిశ్రమపై దాడులు జరిగాయి. కొన్ని సినిమాల విడుదలను అడ్డుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ ప్రోత్సాహకర విధానాలతో ఇండస్ట్రీ మళ్లీ పూర్వ వైభవం సంతరించుకుంది. కానీ ఇప్పుడు జరుగుతున్న వరుస ఘటనల నేపథ్యంలో సినీ పరిశ్రమ మరోసారి సందిగ్ధంలో పడిందనే టాక్ వినిపిస్తోంది. అందుకే ఏపీకి మకాం మార్చితే ఎలా ఉంటుందని కొంతమంది సినీ పెద్దలు ఆలోచనలో పడినట్లు సమాచారం.

ఈ క్రమంలోనే ఏపీ నుంచి సినీ పరిశ్రమకు పిలుపు వచ్చింది. ఏపీకి రండి అని సినీ పరిశ్రమను అక్కడి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో పాటు మంత్రులు, రాజకీయ నేతలు ఆహ్వానిస్తున్నారు. సినిమా షూటింగ్‌లకు అందరూ విదేశాలకు పోతున్నారని.. అలా కాకుండా ఇక్కడే షూటింగ్‌లు చేస్తే ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని పవన్ అన్నారు. అంతేకాదు ప్రోత్సాహాకాలు, రాయితీలు, అన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇస్తుండడంతో కొందరు సినీ పెద్దలు అక్కడికి వెళ్లేందుకు యోచిస్తున్నట్టు సమాచారం. అయితే సినీ పరిశ్రమ ఏపీకి వెళ్తుందా? లేదంటే ఇక్కడే ఉంటుందా అనేది చూడాలి మరి.

Tags:    

Similar News