Live Updates: ఈరోజు (09 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 09 నవంబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం | 09 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | నవమి రా.12-18 తదుపరి దశమి | మఖ నక్షత్రం తె.4-05 తదుపరి పుబ్బ | వర్జ్యం సా.4-18 నుంచి 5-52 వరకు | అమృత ఘడియలు రా.1-43 నుంచి 3-18 వరకు | దుర్ముహూర్తంమ.12-06 నుంచి 12-51 వరకు తిరిగి మ.2-22 నుంచి 3-07 వరకు | రాహుకాలం ఉ.7-30 నుంచి 9-00 వరకు | సూర్యోదయం: ఉ.06-05 | సూర్యాస్తమయం: సా.05-23
ఈరోజు తాజా వార్తలు
తూర్పుగోదావరి జిల్లా..
కాకినాడ..
-జగన్నాదపురం జమ్మి చెట్టు వద్ద నిన్న అర్ధ రాత్రి మహిళ దారుణ హత్య
-రమ్య హాస్పిటల్ లో నర్సుగా ఉద్యోగం చేస్తుందన్న స్థానికులు వెల్లడి..దర్యాప్తు చేపట్టిన పోలీసులు
-మహిళ మృతి దేహాన్ని పోస్ట్ మార్టం నిమ్మితం ప్రభుత్వ హాస్పటల్ కి తరలింపు
విశాఖ..
-గోపాలపట్నం వద్ద నిలిపివున్న లారీని వెనుక నుంచి వేగంగా వస్తున్న మరో లారీ ఢీ
-క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్
-ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు
కర్నూలు జిల్లా..
-నంద్యాల అబ్దుల్ సలాం కుటుంబ సభ్యులను పరామర్శించిన డిప్యూటీ సీఎం అంజాద్ భాష..పాల్గొన్న ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి..
-మృతుడు సలాం కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటాం...
-బాధ్యులైన వారిపై ఇప్పటికే చర్యలు ప్రారంభించాం డిప్యూటీ సీఎం అంజాద్ బాషా...
కృష్ణాజిల్లా..
-కంచికచర్ల(మం) కీసర వద్ద అక్రమంగా తరలిస్తున్న 12 టన్నుల రేషన్ బియ్యం
-లారీని పట్టుకున్న స్పెషల్ బ్రాంచి పోలీసులు
-కంచికచర్ల పోలీస్ స్టేషనుకు తరలింపు
అనంతపురం:
-ఉరవకొండలో టిడిపి నేత ప్యారం కేశవానంద పై హత్యాయత్నం.
-రాత్రి ఇంటికి వెళ్తుండగా కారులో వచ్చి కట్టెలు, ఆయుధాలతో దాడి చేసిన దుండగులు.
-కేశవానంద ను చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన స్థానికులు.
-కేసు నమోదు చేసుకొని విచారిస్తున్న పోలీసులు
విశాఖ..
-మంచుతో కప్పబడిన చింతపల్లి ఏజెన్సీ ప్రాంతం
-చింతపల్లి లో 11 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు
-రానున్న రోజుల్లో మరింత తక్కువ గా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం
అనంతపురం:
-వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన కేంద్ర బృందం.
-వజ్రకరూరు లో చిత్ర ప్రదర్శన తిలకించనున్న అధికారులు.
-మండలంలోని రాగులపాడు, గుళ్యపాళ్యం, వజ్రకరూరు గుంతకల్ మండలం నక్కల దొడ్డి, పాత కొత్త చెరువు గ్రామాల్లో పంటలను పరిశీలిస్తారు వేరుశనగ పరిశీలించనున్న బృందం.
-రైతులతో ముఖాముఖి అనంతరం హెలికాప్టర్ లో తిరిగి వెళ్లనున్న కేంద్ర బృందం.
చిత్తూరు జిల్లా..
-అప్లోడ్ చేసిన యువకుడి అరెస్టు
-చిత్తూరులో ఆటోలో ప్రయాణిస్తున్న ఓ యువతిని రహస్యంగా వీడియో చిత్రీకరించి పోర్న్ సైట్లో పోస్ట్ చేసిన యువకుడు
-యువకుడు వైద్య విద్య ఎంట్రన్స్ కు ఎంపికవడం.. అతడి తండ్రి ఉపాధ్యాయుడు కావడంతో పోలీసులు గట్టిగా మందలించి రిమాండ్ కు తరలించిన చిత్తూరు పోలీసులు
-కొద్దిరోజుల క్రితం ఓ యువతి ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో ములకల చెరువుకు చెందిన యువకుడు చిత్తూరుకు వచ్చి అదే ఆటోలో ఎక్కి ఆమెకు తెలియకుండానే పక్క నుంచి అసభ్యకరంగా వీడియో చిత్రీకరించిన నిందుతుడు.
-ఆ వీడియోను ఏకంగా పోర్న్ వెబ్ సైట్లో అప్ లోడ్ చేసిన నింధితుడు
విశాఖ..
-సెట్రల్ బ్యాంక్ ATM డోర్ పగలుగోట్టిన దొంగలు
-అలారం మోగడంతో పరారైన ATM దొంగలు
-ఘటనా స్థలానికి చేరుకున్న PM పాలెం పోలీసులు
నెల్లూరు:
-- ఇన్ ఫ్లో 5174 క్యూసెక్కు లు.ఔట్ ఫ్లో 8398 క్యూసెక్కు లు.
-- ప్రస్తుత నీటి మట్టం 74.575 టీఎంసీ లు .పూర్తి నీటి మట్టం 77.988 టీఎంసీలు