Kadapa MLA Madhavi Reddy: నాకు కుర్చీ ఎందుకు వేయలేదు.. మేయర్‌పై మాధవి రెడ్డి ఆగ్రహం
Kadapa MLA Madhavi Reddy vs Kadapa MLA Madhavi Reddy: కడప కార్పోరేషన్ (Kadapa Corporation) సమావేశంలో సోమవారం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సమావేశంలో ఎమ్మెల్యేకు కుర్చీ వేయకపోవడంపై టీడీపీ (TDP) కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. గతంలో జరిగిన సమావేశాల్లో మేయర్ కుర్చీ పక్కనే ఎమ్మెల్యేకు కుర్చీలు ఏర్పాటు చేసిన విషయాన్ని ఎమ్మెల్యే మాధవి రెడ్డి గుర్తు చేశారు. గత సమావేశంలో కూడా ఎమ్మెల్యే మాధవి రెడ్డికి కుర్చీ వేయలేదు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాధవి రెడ్డి( MLA Madhavi Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవలనే వైఎస్ఆర్‌సీపీ(YSRCP) నుంచి టీడీపీలో చేరిన ఏడుగురు కార్పోరేటర్లు ఎమ్మెల్యే మాధవికి అండగా నిలిచారు. మరో వైపు మేయర్‌కు మద్దతుగా వైఎస్ఆర్‌సీపీ కార్పోరేటర్లు నిలిచారు. మహిళలను అవమానిస్తున్నారని మేయర్ సురేశ్‌పై (Suresh) ఎమ్మెల్యే మండిపడ్డారు. కార్పోరేషన్ కార్యకలాపాలకు అడ్డు పడుతున్నారని వైఎస్ఆర్‌సీపీ నుంచి టీడీపీలో చేరిన ఏడుగురు కార్పోరేటర్లను సస్పెండ్ చేస్తున్నట్టు మేయర్ ప్రకటించారు. దీంతో వైఎస్ఆర్‌సీపీ కార్పోరేటర్లను కూడా సస్పెండ్ చేయాలని టీడీపీ కార్పోరేటర్లు డిమాండ్ చేశారు.