Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం అల్పపీడనంగా బలహీనపడినట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. భూభాగం నుంచి వీస్తున్న పొడిగాలులే దీనికి కారణమని పేర్కొన్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం తీవ్ర అల్పపీడనం బలహీనపడినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. భూభాగం నుంచి వీస్తున్న పొడిగాలులు దీనికి కారణమని పేర్కొన్నారు. దీంతో ఏపీకి వాయుగుండం ముప్పు తప్పిందన్నారు. అల్పపీడనం ప్రభావంత సోమవారం వరకు తీరం వెంబడి గంటకు గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
సముద్రం అలజడిగా ఉన్న నేపథ్యంలో ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేసింది. వాయుగుండం ప్రభావంతో శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. శనివారం శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీల వరకు తగ్గినట్లు వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం నుంచి బాపట్ల , ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో బారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు.