Earthquake: ప్రకాశం జిల్లాలో భూకంపం
Earthquake: ప్రకాశం జిల్లాలోని పలు చోట్ల శనివారం భూమి కంపించింది.
Earthquake: ప్రకాశం జిల్లాలోని((Prakasam District) పలు చోట్ల శనివారం భూమి కంపించింది(Earth quake). జిల్లాలోని శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, ముండ్లమూరు, వేంపాడు, మారెళ్ల, తూర్పుకంభంపాడు, శంకరాపురంలో భూమి కంపించింది.భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి ప్రజలు బయటకు వెళ్లారు.
డిసెంబర్ 4న ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణ(Telangana) రాష్ట్రాల్లోని పలు గ్రామాల్లో భూమి కంపించింది. తెలంగాణలోని ములుగు (Mulugu)జిల్లాలోని మేడారం(Medaram) కేంద్రంగా భూమి కంపించింది. గోదావరి(Godavari) పరివాహక ప్రాంతంలో భూమి కంపించింది.ఈ నెల 7న మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం దాసరిపల్లిలో శనివారం భూకంపం వాటిల్లింది. జూరాల ప్రాజెక్టుకు సమీపంలో భూమి కంపించింది.రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 3.0 గా నమోదైంది.