AP Constable Recruitment: ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్...డిసెంబర్ 30 నుంచి దేహదారుఢ్య పరీక్షలు
AP Constable Recruitment: ఏపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ బోర్డు కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. వ్రాత పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి దేహదారుఢ్య పరీక్షల కోసం హాల్ టికెట్లను రిలీజ్ చేసింది. ఏపీలో 6100 మంది కానిస్టేబుల్ నియామకం కోసం 2022లో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అభ్యర్థులు ఈ లింక్ ద్వారా కాల్ లెటర్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. https://slprb.ap.gov.in/UI/index డిసెంబర్ 30వ తేదీ నుంచి దేహదారుఢ్య పరీక్షలను జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నారు.
2023 జనవరి 22న ఏపీలో 35 ప్రదేశాల్లో 997 పరీక్ష కేంద్రాల్లో రాతపరీక్షను నిర్వహించారు. 4,59,182 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 95,208 మంది క్వాలిఫై అయ్యారు. దాదాపు 2ఏళ్లుగా ఫిజికల్ పరీక్షల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. కానిస్టేబుల్ నియామకాల్లో భాగంగా దేహదారుడ్య పరీక్షలను డిసెంబర్ 30 నుంచి నిర్వహించనున్నారు. రాతపరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు డిసెంబర్ 18 నుంచి 29వ తేదీ వరకు కాల్ లెటర్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చని రిక్రూట్ మెంట్ బోర్డు తెలిపింది.
ఫిజకల్ టెస్టులు 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 1 వరకు నిర్వహిస్తారని రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్ రవిప్రకాశ్ తెలిపారు. అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే 9441450639, 9100203323 ఉదయం 10 సాయంత్రం 6గంటల వరకు ఈ నెంబర్లకు సంప్రదించాలని సూచించారు.