Tirumala: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్..ఈ తేదీల్లో వైకుంఠ ద్వారా దర్శన టికెట్లు విడుదల

Update: 2024-12-18 00:30 GMT

Tirumala Vaikunta Dwara Darshan: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. వైకుంఠ ద్వారా దర్శన ఏర్పాట్లపై టీటీడీ కీలక నిర్ణం తీసుకుంది. వైకుంఠ ద్వారా దర్శణ టోకెన్లను ఈనెల 23,24వ తేదీల్లో ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలను కల్పించనున్నట్లు టీటీడీ ఈవో తెలిపారు.

డిసెంబర్ 23న ఉదయం 11గంటలకు వైకుంఠ ద్వారా దర్శనాలకు సంబంధించి 10 రోజుల శ్రీవాణి టికెట్లు ఆన్ లైన్లో రిలీజ్ చేస్తారు.

*డిసెంబర్ 24వ తేదీ ఉదయం 11గంటలకు వైకుంఠ ద్వారా దర్శనాలకు సంబంధించి 10 రోజుల ఎస్ఈడీ టికెట్లు ఆన్ లైన్ లో రిలీజ్ చేస్తారు.

*జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 10రోజుల వైకుంఠ ద్వారా దర్శనాలకు తిరుపతిలో 8 కేంద్రాలు, తిరుమలలో 1 కేంద్రంలో ఎస్ఎస్ డీ టోకెన్లు కేటాయిస్తారు.

*తిరుపతిలో ఎంఆర్ పల్లి, జీవకోన, రామానాయుడు స్కూల్, రామచంద్ర పుష్కరిణీ, ఇందిరామైదానం, శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్, తిరుమలలో కౌస్తుభం విశ్రాంతి భవనంలో ఎస్ఎస్ డి టోకెన్ల కేటాయింపు ఉంటుంది.

*టోకెన్ జారీ కేంద్రాల వద్ద భక్తులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సీఈకీ ఆదేశాలు జారీ చేశారు.

*టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వారా దర్శనాలకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. టోకెన్ లేని భక్తులు తిరుమలకు రావచ్చని తెలిపారు. కానీ దర్శనం క్యూ లైన్లలోకి అనుమతించరని తెలిపారు.

*వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 4.45 గంటలకు ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభం అవుతాయి.

*వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 9గంటల నుంచి 11గంటల వరకు స్వర్ణ రథం

*ఉదయం 5.30 నుంచి 6.30 శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం ఉంటుంది.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆరోజు టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది సమన్వయంతో తిరుమలలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పోలీసులు చర్యలు తీసుకోవాలని టీటీడీ సూచించింది. అంతేకాదు ఉదయం 6 నుంచి రాత్రి 12 వరకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు పంపిణీ చేయాలని కేటరింగ్ అధికారులను ఆదేశించింది. టీ, కాఫీ, పాలు, ఉప్మా, చక్కెర పొంగలి, పొంగలి పంపిణీ చేస్తారు. 

Tags:    

Similar News