KUDA Chairman: కుప్పకూలిన ప్రమాణస్వీకారం వేదిక... స్టేజీపై యనమల

KUDA Chairman Thummala Ramaswamy: కాకినాడలో కుడా చైర్మన్ ప్రమాణస్వీకారం కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది.

Update: 2024-12-15 08:51 GMT

KUDA Chairman: కుప్పకూలిన ప్రమాణస్వీకారం వేదిక... స్టేజీపై యనమల

KUDA Chairman Thummala Ramaswamy: కాకినాడలో కుడా చైర్మన్ ప్రమాణస్వీకారం కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి ప్రమాణస్వీకారం కార్యక్రమం జరుగుతుండగా వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో మాజీ మంత్రి చినరాజప్పకు స్వల్ప గాయాలయ్యాయి.

స్టేజ్ కూలిన సమయంలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే చినరాజప్ప, పంతం నానాజీతో పాటు పలువురు నేతలు వేదికపైనే ఉన్నారు. వీరిలో చిన రాజప్పకు స్వల్ప గాయాలయ్యాయి. యనమల రామకృష్ణుడు, పంతం నానాజీ ప్రమాదం నుండి బయటపడ్డారు.

Full View

ప్రమాణస్వీకారోత్సవం కోసం ఏర్పాటు చేసిన వేదికపైకి పరిమితికి మించి నాయకులు ఎక్కడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ప్రమాణస్వీకారం చేయకముందే ఈ ఘటన జరిగింది. దీంతో రామస్వామి ప్రమాణస్వీకారం కోసం మరో తేదీని ప్రకటించనున్నట్లు సమాచారం. 

Tags:    

Similar News