AP Weather Report: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. మూడ్రోజులపాటు భారీ వర్షాలు
AP Rains: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది.
AP Rains: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీలో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు(Heavy Rains) పడనున్నాయి. తిరుపతి, నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణకోస్తా, రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు.. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
మిగిలిన అన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. బుధవారం తమిళనాడు, గురు, శుక్రవారాల్లో ఒడిశాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశముంది. బుధ, గురువారాల్లో సముద్రం అలజడిగా మారుతుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ(IMD) హెచ్చరించింది.