Vangalapudi Anitha: సినిమాలు చూసి అవి నేర్చుకోవద్దు

AP Home Minister Vangalapudi Anitha: నేటి యువతను ఉద్దేశించి ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-12-15 11:54 GMT

AP Home Minister Vangalapudi Anitha: నేటి యువతను ఉద్దేశించి ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత పలు కీలక వ్యాఖ్యలు చేశారు. యువత సినిమాల నుండి మంచి కంటే చెడే ఎక్కువగా నేర్చుకుంటోందన్నారు. సమాజంలో ఆడబిడ్డలకు రక్షణ అందించినప్పుడే అసలైన హీరోలు అని అనిపించుకుంటారని అభిప్రాయపడ్డారు. యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడకుండా తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని అన్నారు.

ఆడబిడ్డలను రక్షించుకుందాం... సమాజాన్ని కాపాడుకుందాం అని అనిత పిలుపునిచ్చారు. సేవ్ ది గర్ల్ చైల్డ్ పేరుతో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 2K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత పాల్గొని మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. స్త్రీలు ఎవ్వరిపైనా ఆధారపడకూడదనే ఉద్దేశంతోనే సీఎం చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడే డ్వాక్రా సంఘాలు తెచ్చారని గుర్తుచేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఆడపిల్లల రక్షణకు తొలి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఆడపిల్లలను ప్రోత్సహించి సమాన అవకాశాలు కల్పిస్తే వారు కూడా అన్ని రంగాల్లో రాణిస్తారని తెలిపారు.

Full View


Tags:    

Similar News