Manchu Manoj: జనసేనలోకి మంచు మనోజ్ దంపతులు..?
మంచు మనోజ్ (Manchu Manoj ), ఆయన భార్య భూమ మౌనిక రెడ్డి (Bhuma Mounika reddy) జనసేనలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.
Manchu Manoj: మంచు మనోజ్ (Manchu Manoj ), ఆయన భార్య భూమ మౌనిక రెడ్డి (Bhuma Mounika reddy) జనసేనలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఆళ్లగడ్డలో తమ రాజకీయ ప్రవేశం గురించి మనోజ్, మౌనిక ప్రకటించే అవకాశం ఉందని మౌనికరెడ్డి సన్నిహితులు చెబుతున్నారు.
మంచు కుటుంబంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో రాజకీయంగా బలపడాలని భావిస్తున్నారని సమాచారం. డిసెంబర్ 16న మంచు మనోజ్ దంపతులు తమ అనుచరులతో హైదరాబాద్ నుంచి ర్యాలీగా ఆళ్ళగడ్డకు వెళ్తారు.
ఆళ్లగడ్డ నుంచి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరపున మౌనిక సోదరి అఖిలప్రియ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2014-2019 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కేబినెట్ లో అఖిలప్రియ పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు.
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు మంచు మనోజ్ కు మంచి సంబంధాలున్నాయి. దీంతో మనోజ్ జనసేనలో చేరాలని భావిస్తున్నారని చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనోజ్ తండ్రి మోహన్ బాబు టీడీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఆ తర్వాత ఆయన టీడీపీకి దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన వైఎస్ఆర్‌సీపీలో చేరారు.