AP Rain ALERT : ఏపీకి అల్పపీడనం రూపంలో మరో గండం..తెలుగు రాష్ట్రాలకు పిడుగులతో కూడిన భారీ వర్ష సూచన

Update: 2024-12-14 01:32 GMT

AP Rain ALERT : భారత వాతావరణ శాఖ మరో కీలక హెచ్చరిక జారీ చేసింది. మరో అల్పపీడనం ఏర్పడబోతున్నట్లు తెలిపింది. నేడు దక్షిణ అండమాన్ సముద్రంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇది క్రమంగా అల్పపీడనం గా మారి సోమవారం ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అయితే ఆదివారం నుంచి అల్పపీడనంగా మారుతుందని ఐఎండీ అంచనా వేసింది.

వచ్చే 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా తమిళనాడు తీరంపైవు కదిలే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. దీని ప్రభావంతో ఏపీలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అయితే ఇవాళ మాత్రం రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో సోమవారం ప్రకారం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.

మంగళవారం కోస్తా, రాయలసీమలో విస్తారంగా మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని..కొన్నిచోట్ల చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు హెచ్చరించింది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. భారీ వర్ష సూచన నేపథ్యంలో పరివాహక ప్రాంతాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాగులు, వంకలు నదులు ఇప్పటికే ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

భారీగా కురుస్తున్న వర్షాలకు కాళంగి రిజర్వాయర్, అరణియార్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశారు. జిల్లాలోని మిగిలిన ప్రాజెక్టులోనూ నీటిని విడుదల చేశారు. జిల్లాల్లోని మిగిలిని ప్రాజెక్టుల్లోనూ డ్యామ్ లలోనూ పూర్తి స్థాయిలో నీటి నిలువకు చేరుకున్నాయి. ఈ ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో వాతావరణంలో మరిన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఏపీలో మరికొన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది.

Tags:    

Similar News