Vidadala Rajini: మాజీమంత్రి విడదల రజినిపై క్రిమినల్ కేసు..?
Vidadala Rajini: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని క్వారీ యజమానిని వైసీపీ (YSRCP) నాయకురాలు, మాజీ మంత్రి విడుదల రజని (Vidadala Rajini), ఐపీఎస్ అధికారి పల్లె జాషువా..
Vidadala Rajini: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని క్వారీ యజమానిని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడుదల రజని (Vidadala Rajini), ఐపీఎస్ అధికారి పల్లె జాషువా బెదిరించి రెండు కోట్ల రూపాయలు వసులు చేసినట్టు విజిలెన్స్ అండ్ ఎన్పోర్స్ మెంట్ విభాగం తేల్చింది. ఈ నగదులో రెండు కోట్లు విడుదల రజని, పది లక్షలు జాషువా, మరో పది లక్షలు రజని పీఏ తీసుకున్నట్టు నిర్దారించారు. వీరందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. తాజాగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
2020 సెప్టెంబర్ 4 విడుదల రజని పీఏ రామకృష్ణ, శ్రీలక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ కు వెళ్లి ఎమ్మెల్యే రమ్మంటున్నారంటూ యజమానులకు హుకుం జారీ చేశారని ప్రభుత్వానికి ఇచ్చిన నివేదకలో తెలిపారు. తప్పని పరిస్థితుల్లో క్వారీ యజమానులు డబ్బులు చెల్లించుకోవాల్సి వచ్చింది. విడుదల రజనికి రెండు కోట్లు, జాషువాకు పది లక్షలు, రజనీ పీఏకు పది లక్షలు చెల్లించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి సిపార్సు చేసింది. రజనీతో పాటు మరో నలుగురుపై క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.